Mohammad Azharuddin: పుణె జిల్లా మావల్ తాలూకాలోని టికోణా పేట్ ప్రాంతంలో ఉన్న మాజీ భారత క్రికెటర్ మొహమ్మద్ అజహరుద్దీన్ భార్య సంగీతా బిజ్లానీకి చెందిన బంగ్లాలో దొంగతనం జరిగిన ఘటనపై కేసు నమోదైంది. ఈ సంఘటన మార్చి 7 నుండి జూలై 18 మధ్య జరిగినట్లు పుణె రూరల్ పోలీస్ సీనియర్ అధికారి వెల్లడించారు. పోలీసుల ప్రకారం, గుర్తు తెలియని దొంగలు బంగ్లా వెనుక భాగంలోని గోడపై ఉన్న వైర్ మెష్‌ను కత్తిరించి.. ఆపై మొదటి అంతస్తు గ్యాలరీకి ఎక్కారు. అక్కడ కిటికి గ్రిల్‌ను తెరిచి ఇంట్లోకి చొరబడ్డారని తెలిపారు.
Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ పెంపుకు పచ్చజెండా?
దొంగలు ఇంట్లోని రూ.50,000 నగదు, సుమారు రూ.7,000 విలువైన టీవీ సెట్ ను అపహరించారు. దీనితో మొత్తం రూ.57,000 మేర దొంగలపాలు అయ్యింది. అంతేకాకుండా, ఇంట్లోని ఇతర వస్తువులను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసినట్లు కనిపించాయి. ఈ ఘటనపై 54 ఏళ్ల ముహమ్మద్ ముజీబ్ ఖాన్, అజహరుద్దీన్ వ్యక్తిగత సహాయకుడు లోనావాలా రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగ్లా మార్చి 7 నుండి జూలై 18 మధ్య ఖాళీగా ఉండగా.. ఆ సమయంలో ఈ దొంగతనం జరిగి ఉండొచ్చని ఆయన తెలిపారు.
Tirumala: టీటీడీలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులపై వేటు..
ఈ ఫిర్యాదుపై జూలై 19న ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. గుర్తు తెలియని దొంగలపై కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి దొంగిలించిన వాటిని రికవరీ కాలేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి సీసీటీవీ దృశ్యాలు, ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించడంలో నిమగ్నం అయ్యారు. దోపిడీకి పాల్పడిన వ్యక్తుల గుర్తింపు కోసం దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ ఘటనపై ఇంకా మరిన్ని వివరాలు వెలుగు చూడాల్సి ఉంది.