Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- జలమండలి మేనేజర్ నివాసంలో ఏసీబీ సోదాలు
- 100 కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తింపు
- రూ.1.10 కోట్ల నగదు, సుమారు కేజీ బంగారం స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ జలమండలిలో మేనేజర్‌గా పనిచేస్తున్న అనంత లక్ష్మి కుమార్ ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మల్లాపూర్‌లోని ఆయన నివాసంతో పాటు బంధువుల ఇళ్లలో మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి. ఉదయం ప్రారంభమైన ఈ సోదాలు.. ఇప్పటికే ఏడు గంటలకు పైగా కొనసాగుతున్నట్లు సమాచారం. సోదాల్లో భాగంగా ఏసీబీ అధికారులు భారీ స్థాయిలో అక్రమ ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది.
అనంత లక్ష్మి కుమార్ ఇంట్లో నుంచి రూ.1.10 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒక కిలో బంగారు ఆభరణాలను కూడా సీజ్ చేశారు. ఇంట్లో దొరికిన నగదు, బంగారం చూసి అధికారులు ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని పలు గేటెడ్ కమ్యూనిటీల్లో మూడు ఫ్లాట్లు, మరో ఆరు ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. నిజామాబాద్ జిల్లాలో మూడు ఎకరాల భూమి కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆస్తుల మొత్తం విలువ రూ.100 కోట్లకు పైగా ఉండొచ్చని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి.
Also Read
- CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై పిల్ కొట్టేయండి.. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్
- Saturday Horoscope: సెప్టెంబర్ 5 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
- Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
సోదాల సమయంలో రెండు కార్లను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రిట్జ్, బ్రిజా కార్లను ఏసీబీ సీజ్ చేసింది. అదేవిధంగా పలు బ్యాంక్ అకౌంట్లు, లాకర్ల వివరాలను కూడా అధికారులు గుర్తించారు. వాటిలో ఉన్న నగదు, ఆభరణాలు, డాక్యుమెంట్లపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. అనంత లక్ష్మి కుమార్ ఆదాయానికి మించి భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టినట్లు అనుమానిస్తున్న ఏసీబీ అధికారులు.. ఆస్తుల కొనుగోళ్లు, పెట్టుబడులు, కుటుంబ సభ్యుల పేర్లపై నమోదైన ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారు. సోదాలు పూర్తయ్యాక పూర్తి స్థాయి నివేదిక విడుదల చేసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Teachers Day 2026: ఈ రోజే టీచర్స్ డే.. గురువు గొప్పతనం ఏంటో తెలుసుకోవాలంటే ఈ ఒక్క కథ చాలు!
-
POCO X8, X8 Power: పోకో ఎక్స్8 పవర్, పోకో ఎక్స్8 భారత్‌లో లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్, ధరలు ఇవే!
-
Dharman: రజనీకాంత్ ‘ధర్మన్’ రెండో షెడ్యూల్ పూర్తి.. రెండు రోజుల్లోనే షూటింగ్ ఫినిష్?
-
CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
-
India vs Pakistan: నేడు భారత్ vs పాకిస్తాన్ మహిళల టీ20 మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా లైవ్ చూడాలి?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!