Telangana University : తెలంగాణ యూనివర్సిటీ లో ఏసీబీ సోదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ గుప్తా కాలేజీకి పరీక్ష హాలు కేటాయించేందుకు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీసీ డిమాండ్‌పై ఫిర్యాదుదారు దాసరి శంకర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు.నిజామాబాద్‌కు చెందిన శంకర్ భీమ్‌గల్‌లోని తన కళాశాలకు పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని వీసీని సంప్రదించగా, వీసీ అనుమతులు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేశాడు. ఇటీవల ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ యూనివర్సిటీలో ఏసీబీ, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు సోదాలు నిర్వహించాయి.
Also Read : Hair Fall Tips: పెరుగుతో రోజూ ఇలా చేస్తే.. మీ జుట్టు రాలడం వారంలో తగ్గిపోతుంది! ట్రై చేసి చూడండి
Also Read
అనుచిత నియామకాలు, లావాదేవీలు జరిగాయని గుర్తించిన బృందాలు వీసీ ఇంటిపై దాడికి స్కెచ్ వేసి శనివారం ఉదయం తార్నాకలోని ఆయన ఇంటిపై దాడి చేసినట్లు సమాచారం. ఫిర్యాదుదారుడు శనివారం ఉదయం వీసీని కలవడానికి వెళ్లి లంచం డబ్బును అందజేయగా, ఏసీబీ బృందాలు అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. యూనివర్శిటీ ప్రాంగణాల్లోనూ దాడులు చేస్తున్నారు. నియామకాల విషయంలో అవతవకలకు పాల్పడ్డారని, నిధుల దుర్వినియోగం కూడా జరిగిందనేది ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి. అయితే రవీందర్ గుప్తా ఏసీబీ ట్రాప్‌కు చిక్కడంతో ఆయన హయాంలో వర్శిటీలో జరిగిన గోల్‌మాల్ వ్యవహారాలు వెలుగులోకి వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
Also Read : Pesticides: తల్లి పాల ద్వారా పిల్లలకు చేరుతున్న పురుగుమందులు.. మాంసం తింటే రిస్క్ ఎక్కువట!
తాజావార్తలు
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!