Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
- ‘యమదొంగ’ పులి సీన్‌తో తారక్ గ్రాండ్ ఎంట్రీ
- చిన్నారి సారా మ్యాజిక్‌తో స్టేజ్‌పై సర్ప్రైజ్
- చాలా రోజుల తర్వాత ఈవెంట్లో ఎన్టీఆర్ సందడి
- తారక్ ఎనర్జీకి ఫ్యాన్స్ నుంచి భారీ రెస్పాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్కా మీడియా వర్క్స్ నిర్మించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో అభిమానుల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘డ్రాగన్’ చిత్ర షూటింగ్ సమయంలో భుజానికి తీవ్ర గాయమై కొద్దిరోజులుగా విశ్రాంతి తీసుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్, ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిర్మాత కార్తికేయపై ఉన్న ప్రత్యేక అభిమానంతో, తన ఆరోగ్య పరిస్థితిని పక్కనపెట్టి తారక్ ఈ కార్యక్రమానికి హాజరుకావడం చిత్ర బృందానికి కొండంత బలాన్నిచ్చింది. చాలా రోజుల విరామం తర్వాత తమ అభిమాన కథానాయకుడిని వేదికపై ప్రత్యక్షంగా చూడటంతో సభా ప్రాంగణం నందమూరి అభిమానుల కేరింతలతో మారుమోగిపోయింది.
స్టేజ్‌పై పులి నుంచి తారక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మ్యాజిక్ ఎంట్రీ!
ఈ కార్యక్రమానికి అత్యంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది జూనియర్ ఎన్టీఆర్ వినూత్న ప్రవేశం. బ్లాక్‌బస్టర్ సినిమా ‘యమదొంగ’లో పులి కాస్తా తారక్‌గా మారే సంచలన ఘట్టాన్ని వేదికపై ప్రత్యక్షంగా ఆవిష్కరించారు. సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న చిన్నారి సారా తన మ్యాజిక్ ట్రిక్‌తో స్టేజ్‌పై ఉన్న పులి బొమ్మను ఎన్టీఆర్‌లా మార్చేయడం ప్రేక్షకులకు విపరీతమైన థ్రిల్‌ను పంచింది. తారక్ రోరింగ్ ఎంట్రీ, ఆయన గ్రాండ్ వాక్కు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ ప్రస్తుతం ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లతో పాటు అన్ని సోషల్ మీడియా వేదికలపై వైరల్ ట్రెండింగ్‌లో నిలిచాయి.
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
అక్టోబర్ 2న థియేటర్లలోకి క్రేజీ ప్రాజెక్ట్.. ఫహాద్-శశాంక్ కాంబోపై భారీ అంచనాలు!
వర్సటైల్ నటుడు ఫహాద్ ఫాజిల్ కథానాయకుడిగా, శశాంక్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రంపై ఇండస్ట్రీలో అపారమైన అంచనాలు ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ‘బాహుబలి’ వంటి దృశ్యకావ్యాన్ని నిర్మించిన శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, వినూత్నమైన ట్రైలర్ ప్రేక్షకులలో భారీ హైప్‌ను క్రియేట్ చేయగా, అక్టోబర్ 2న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఎన్టీఆర్ అందించిన ఈ గ్రాండ్ సపోర్ట్‌తో సినిమా ప్రమోషన్స్ సరికొత్త మైలేజ్ సాధించాయి.
తాజావార్తలు
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
-
OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
-
OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
-
Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..
-
Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!