Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
- ‘డ్రాగన్’ షూటింగ్‌పై తారక్ కీలక అప్డేట్
- జక్కన కుటుంబంపై ఎన్టీఆర్ ఎమోషనల్ కామెంట్స్
- కార్తికేయ తనకు తమ్ముడిలాంటి వాడన్న తారక్
- ఫ్లాప్స్ సమయంలో అండగా నిలిచాడని గుర్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో వేడుకగా జరిగిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ వేదికపై ఎంతో ఎమోషనల్‌గా మాట్లాడారు. ఫహాద్ ఫాజిల్ (ఫాఫా) చేత వేదికపై సరదాగా తొడ కొట్టించిన తారక్, తన వ్యక్తిగత జీవితం, రాజమౌళి కుటుంబంతో ఉన్న ప్రేమానురాగాలు, రాబోయే ‘డ్రాగన్’ చిత్రంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చేతికి సర్జరీ తర్వాత మళ్లీ అదే జోష్.. ‘డ్రాగన్’ షూటింగ్‌లోకి త్వరలోనే!
ఇటీవల చేతికి సర్జరీ జరగడం వల్ల కొంత ఎనర్జీ తగ్గినా, అభిమానులను ఇక్కడ చూడగానే తనలో మళ్లీ పాత జోష్ వచ్చిందని ఎన్టీఆర్ తెలిపారు. ప్రస్తుతం తన చెయ్యి బాగానే ఉందన్న ఆయన, త్వరలోనే ‘డ్రాగన్’ షూటింగ్లో పాల్గొంటానని స్పష్టం చేశారు. మైత్రి రవి చెప్పినట్లే అనుకున్న తేదీకి కచ్చితంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఇక ఈ చిత్ర దర్శకుడు శశాంక్ గురించి మాట్లాడుతూ, దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్నప్పటి నుంచే ఆయన తనకు తెలుసని, ఎన్నో ప్రయత్నాల తర్వాత దర్శకుడిగా మారి ఈ చిత్రాన్ని తెరకెక్కించడం సంతోషంగా ఉందన్నారు.
Also Read
నా బాధను దేవుడు చూశాడు.. జక్కన, కీరవాణి కుటుంబాలే నా శక్తి!
తన సినీ ప్రయాణం ప్రారంభమైన రోజులను ఎన్టీఆర్ ఎమోషనల్‌గా గుర్తుచేసుకున్నారు. 2001లో తన మొదటి సినిమా పూజా కార్యక్రమం జరిగినప్పుడు అమ్మ రానందని, నాన్న ‘నీ కాళ్ల మీద నువ్వే నిలబడాలి’ అని చెప్పి రాలేకపోయారని వెల్లడించారు. ఆ సమయంలో తన కుటుంబం నుంచి ఎవరూ రాలేదని తీవ్రంగా బాధపడ్డానని తెలిపారు. అయితే ఆ బాధను చూసిన దేవుడు, తనకు ‘జక్కన’ రాజమౌళి, కీరవాణి రూపంలో మరో గొప్ప కుటుంబాన్ని ఇచ్చారని చెప్పారు. అభిమానులు తన శక్తి అయితే, రాజమౌళి కుటుంబం దేవుడు ఇచ్చిన మరో కుటుంబమని చెప్పారు.
కార్తికేయ నా తమ్ముడే.. ఫ్లాప్స్‌లో నా పక్కనే నిలబడ్డాడు!
తనకు సొంత తమ్ముడు లేని లోటును కార్తికేయ తీర్చాడని తారక్ భావోద్వేగానికి గురయ్యారు. చిన్నతనంలో తన తల్లిని “నన్ను ఒక్కడినే ఎందుకు కన్నావు అమ్మ, ఇంకో తమ్ముడు ఉంటే బాగుండేది” అని అడిగేవాడ్నని, ఒకవేళ తనకు తమ్ముడు ఉంటే కచ్చితంగా కార్తికేయ లాగే ఉండేవాడని అన్నారు. తన కెరీర్లో వరుస ఫ్లాప్‌లు వచ్చి తీవ్ర కష్టాల్లో ఉన్న సమయంలో కార్తికేయ కొండంత అండగా నిలబడ్డాడని గుర్తుచేసుకున్నారు. రాజమౌళి, తాను అంత త్వరగా ఎమోషనల్ అవ్వమని, కానీ కార్తికేయ తమను ఎమోషనల్ చేసేశాడని చెప్పారు. చివర్లో “ఊరికే మైక్ పట్టుకుని లాగకండి, వారణాసి సినిమా ఈవెంట్లో మాట్లాడండి” అని నారాయణతో సరదాగా ముచ్చటించడంతో సభలో నవ్వులు పూశాయి.
తాజావార్తలు
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
-
OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
-
OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!