వరంగల్ జిల్లా ఖిలావరంగల్ తహసిల్దార్ బండి నాగేశ్వర్ రావు ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు చేశారు. హనుమకొండ ప్రశాంత్ నగర్ లోని ఆయన ఇంటిపై వరంగల్ ఏసీబీ అధికారులు ఉదయం నుంచి సోదాలు జరుపుతున్నారు. తహసిల్దార్ నాగేశ్వరరావు సొంత జిల్లా ఖమ్మంలో సైతం ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. బండి నాగేశ్వర్ రావు గతంలో ధర్మసాగర్, కాజీపేట, హసన్ పర్తి మండలాల్లో తహసిల్దారుగా పనిచేశారు. ఆ సమయంలో ఆయనపై ఆరోపణలు వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టినట్లు తెలిసింది.సోదాల్లో భారీగా నగలు పట్టుబడుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.