Wamiqa Gabbi: సెన్సార్.. ప్రతి సినిమాకు ఇది ఏంటో ముఖ్యం. ఒకప్పుడు.. హీరోయిన్ చీర పక్కకు తొలగించినా కూడా సెన్సార్ దానికి అడ్డుకట్ట వేసింది. కానీ, ఉన్నకొద్దీ సినిమా తీరుతెన్నులు మారుతూ వస్తున్నాయి. ఒకప్పుడు రొమాన్స్ అంటే ఛీ అనుకునేవారు.. ఇప్పుడు సినిమాల్లోనే రొమాన్స్ కన్నా ఎక్కువ చూపిస్తున్నారు. కొన్ని కొన్ని సీన్స్ కు సెన్సార్ కూడా అడ్డుకట్ట వేయలేకపోతుంది. కథను బట్టే ఆ సీన్స్ వచ్చాయని డైరెక్టర్స్ చెప్తుంటారు.. డైరెక్టర్ చెప్పిందే తాము చేశామని నటీనటులు చెప్తారు. ఏదిఏమైనా ఈ సెన్సార్ కొన్ని సీన్స్ కు అడ్డుకట్ట వేయకపోవడం వలన కుటుంబాలతో కలిసి చూడలేకపోతున్నారు. కనీసం థియేటర్ లో అయినా కొన్నింటికి సెన్సార్ ఉంటుంది. కానీ, ఓటిటీకి సెన్సార్ లేకపోవడంతో మేకర్స్ రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ ఈ మధ్య వస్తున్న కంటెంట్ మొత్తం అడల్ట్ కంటెంట్ తో కూడుకున్నది. మాటలకూ అయితే మ్యూట్ ఇస్తున్నారు కానీ, కొన్ని సీన్స్ కు మాత్రం సెన్సార్ చేయడం లేదు.
తాజాగా నెట్ ఫ్లిక్స్ లో కూఫియా అనే ఒక సిరీస్ స్ట్రీమింగ్అవుతున్న విషయం తెల్సిందే. టబు ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. అందుకు కారణం వామిక గబ్బి. ఈ పేరు ఎక్కడో విన్నట్టున్నారు కదా. తెలుగులో సుధీర్ బాబు సరసన భలే మంచి రోజు సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమ ఆశించిన ఫలితం అనుకోలేకపోయేసరికి అమ్మడు మళ్లీ తిరిగి టాలీవుడ్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇక ఈ మధ్య ఎక్కడ చూసినా ఈ భమేం కనిపిస్తోంది. ఇక కూఫియా గురించి వస్తే ఇందులో వామిక బోల్డ్ సీన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని సీన్స్ లో సెమీ న్యూడ్ సీన్స్ తో కనిపించింది. బికినీ వేసుకొని అద్దం ముందు అమ్మడు అందాల ఆరబోత అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. ఇక ఈ వీడియో చూసిన కొంతమంది .. సెన్సార్ లేదని మరి ఇంత నగ్నంగా చూపిస్తారా.. ? అంటూ చెప్పుకొస్తారు.
What a Bold Performance 💥@GabbiWamiqa#WamiqaGabbi #Khufiya pic.twitter.com/zb0BLqGN3D
— Ragnar (@Ragnar07Ragnar) October 5, 2023