మద్యం కేసులో స్వాధీనం చేసుకున్న రూ.11 కోట్ల నగదుపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆర్డర్స్ కాపీని మాచవరం ఎస్.బిఐ బ్యాంకు అధికారులకు అందజేసిన కోర్టు సిబ్బంది. రూ.11 కోట్ల నగదు విషయంలో కోర్టు ఆదేశాలను పాటించాలని బ్యాంకు అధికారులను కెసిరెడ్డి న్యాయవాదులు కోరారు. గత నెల 30వ తేదీన సిట్ రూ. 11 కోట్ల నగదు సీజ్ చేసిన విషయం తెలిసిందే.
READ MORE: Coolie Trailer : రజినీకాంత్ కూలీ ట్రైలర్ వచ్చేసింది
ఆ నగదును రాజ్ కెసిరెడ్డికి చెందినదేనంటూ సిట్ అధికారులు కోర్టులో మెమో దాఖలు చేసినట్లు రాజ్ కెసిరెడ్డి తరపు న్యాయవాది విష్ణువర్ధన్ తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమకు కొన్ని సందేహాలు ఉండటంతో కోర్టులో తాము కూడా మెమో దాఖలు చేశామన్నారు. “కోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఆ నగదును విడిగా ఉంచాలని కోరాం. మేం పిటిషన్ వేసినట్లు తెలుసుకుని సిట్ అధికారులు హడావిడిగా మెమో దాఖలు చేశారు. మేం దాఖలు చేసిన మెమో పై కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. రూ. 11 కోట్ల నగదుకు పంచనామా జరిపించాలని ఆదేశాలిచ్చింది. మిగిలిన నగదుతో ఆ 11 కోట్లను కలపొద్దని ఆదేశాలిచ్చింది.
సిట్ సీజ్ చేసిన నగదు జూన్ 2024 తర్వాత ముద్రించిన నగదుగా మాకు సందేహాలున్నాయి. ఆర్బీఐకి కూడా లేఖ రాశాం. కానీ సిట్ అధికారులు హడావిడిగా బ్యాంకులో జమ చేసేశారు. కోర్టు ఆదేశాలను పాటించాలని బ్యాంకు అధికారులను కోరాం.
కెసిరెడ్డి అరెస్టైన వంద రోజుల తర్వాత రూ.11 కోట్లు అతనివేనని ఎలా చెబుతారు.” అని ప్రశ్నించారు. లిక్కర్ కేసులో విచారణ అంతా ఒక పథకం ప్రకారం జరుగుతోందని మరో న్యాయవాది అనుమానం వ్యక్తం చేశారు.
READ MORE: Abhinay Kinger : హీరోకు భయంకరమైన రోగం.. త్వరలోనే చనిపోతాడంట