Xiaomi 17 Series: షావోమీ 17 సిరీస్ (Xiaomi 17 Series) స్మార్ట్ ఫోన్లు ఈ నెలలోనే చైనా మార్కెట్లోకి విడుదల అవ్వడానికి ముహూర్తం ఖరారు చేసింది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ల విడుదల తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. షావోమీ 17 (Xiaomi 17), షావోమీ 17 ప్రో (Xiaomi 17 Pro), షావోమీ 17 ప్రో మ్యాక్స్ (Xiaomi 17 Pro Max) మోడళ్ల డిజైన్‌ను కూడా సంస్థ విడుదల చేసింది. షావోమీ 17 ప్రో మోడళ్లకు వెనుక భాగంలో సెకండరీ డిస్‌ప్లే ఉండడం ఇందులో విశేషంగా చెప్పవచ్చు. అలాగే ఈ ఫోన్లలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ఎస్‌ఓసీ (Snapdragon 8 Elite Gen 5 SoC) ప్రాసెసర్‌ను ఉపయోగించారు. గతేడాది విడుదలైన షావోమీ 15 సిరీస్ ఫోన్లకు ఇవి అప్డేటెడ్ వెర్షన్.
CPL 2025: ఆధిపత్యాన్ని నిరూపించుకున్న ‘ట్రిన్‌బాగో నైట్ రైడర్స్’.. ఐదోసారి టైటిల్ కైవసం
ఈ షావోమీ 17(Xiaomi 17), షావోమీ 17 ప్రో, షావోమీ 17 ప్రో మ్యాక్స్ ఫోన్లు సెప్టెంబర్ 25న చైనాలో లాంచ్ కానున్నాయి. షావోమీ అధికారిక వీబో పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. అక్కడి స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు అంటే భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు ఈ ఫోన్లు విడుదలవుతాయి. ఈ సిరీస్‌లోని అన్ని ఫోన్లలో కొత్త షావోమీ హైపర్‌ఓఎస్ 3 (HyperOS 3) ను ఉపయోగించారు.
కాగా, షావోమీ తన అగ్రశ్రేణి మోడల్‌కు ‘అల్ట్రా’ బ్రాండింగ్‌ను వదిలివేసి.. ‘ప్రో మ్యాక్స్’ బ్రాండింగ్‌ను ఉపయోగిస్తోంది. అచ్చం ఇదివరకు ఐఫోన్ 17 సిరీస్‌ను ఆపిల్ కంపెనీ ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్, ఐఫోన్ ఎయిర్ వేరియంట్లలో విడుదల చేసింది. షావోమీ కూడా ఆపిల్‌తో నేరుగా పోటీ పడేందుకు ఈ వ్యూహాన్ని అనుసరిస్తోంది. షావోమీ 17 సిరీస్ లాంచ్ పోస్టర్‌లో మూడు ఫోన్ల వెనుక భాగాన్ని చూపెట్టారు. అన్ని ఫోన్లలో లైకా సహకారంతో ఉన్న కెమెరాలు ఉన్నాయి. షావోమీ 17 ఫోన్ వెనుక భాగంలో పైభాగంలో ఎడమ వైపు గుండ్రని అంచులతో ఉన్న కెమెరా మాడ్యూల్‌ను చూడవచ్చు.
28th National Conference on e-Governance: విశాఖలో ఈ-గవర్నెన్స్‌పై జాతీయ స్థాయి సదస్సు
షావోమీ 17 ప్రో, షావోమీ 17 ప్రో మ్యాక్స్ ఫోన్లకు ‘మ్యాజిక్ బ్యాక్ స్క్రీన్’ (Magic Back Screen) అనే సెకండరీ డిస్‌ప్లే ఉంటుంది. ఇది వెనుక కెమెరా మాడ్యూల్‌తో అనుసంధానమై ఉంటుంది. ఈ డిస్‌ప్లేలో సమయం, ఇతర వివరాలను యానిమేటెడ్ థీమ్‌లతో చూడవచ్చు. ఈ ఫోన్లలో అనేక అప్‌గ్రేడ్‌లు ఉన్నప్పటికీ ఈ ఫోన్ల ధరలు పాత మోడళ్ల కంటే ఎక్కువ ఉండకపోవచ్చని అంచనా. ప్రస్తుతం ఈ ఫోన్లకు చైనాలో ముందస్తు అమ్మకాలు ప్రారంభమయ్యాయి.