Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Sharma: ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్ మరో చారిత్రక క్షణానికి సిద్ధమైంది. నేటి మ్యాచ్‌లో విధ్వంసకర ఓపెనర్ కాటేరమ్మకొడుకు అభిషేక్ శర్మ బ్యాట్ ఝుళిపిస్తే, టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు కరిగిపోనుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యంత తక్కువ బంతుల్లో రెండు వేల పరుగులు పూర్తి చేసిన ఘనత ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉంది. 2026లో భారత్‌ను టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిపిన సూర్య.. తన ఇన్నింగ్స్‌లో 1,164వ బంతికి ఈ మైలురాయిని అందుకున్నాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా ప్లేయర్ ఆరోన్ ఫించ్ (1,283 బంతులు), గ్లెన్ మాక్స్వెల్ (1,304 బంతులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అయితే నేడు అభిషేక్ శర్మ ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది.
కేవలం రెండు వేల పరుగుల రికార్డే కాకుండా, ఒక కాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డుపై కూడా అభిషేక్ కన్నేశాడు. 2026లో ఇప్పటివరకు 31 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ 63 సిక్సర్లు కొట్టాడు. ఫుల్ మెంబర్ దేశాల ఆటగాళ్లలో ఒకే ఏడాదిలో అత్యధిక సిక్సర్ల రికార్డును అధిగమించడానికి అతనికి కేవలం ఆరు సిక్సర్లు మాత్రమే అవసరం. ప్రస్తుతం ఈ రికార్డు కూడా 2022లో 31 మ్యాచ్‌ల్లో 68 సిక్సర్లు బాదిన సూర్యకుమార్ పేరిటే ఉంది. కేవలం ఇంటర్నేషనల్ వేదికపైనే కాకుండా ఈ ఏడాది ఓవరాల్ టీ20 మ్యాచ్‌ల్లోనూ అభిషేక్ విజృంభిస్తున్నాడు. వివిధ జట్ల తరఫున ఈ ఏడాది 46 టీ20ల్లో 106 సిక్సర్లు బాదిన అతను, తన సొంత రికార్డును తానే బ్రేక్ చేయడానికి కేవలం మూడు సిక్సర్ల దూరంలో ఉన్నాడు. గత ఏడాది 2025లో భారత్, పంజాబ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 41 మ్యాచ్‌ల్లో 108 సిక్సర్లు బాదిన రికార్డు ఏ భారత బ్యాటర్‌కైనా ఇదే అత్యధికం.
Also Read
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
నేటి మ్యాచ్‌లో అభిషేక్‌తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా మరో భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఇషాన్, 2026లో ఇప్పటివరకు 31 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 1,085 పరుగులు సాధించాడు. నేటి మ్యాచ్‌లో కనీసం 80 పరుగులు చేస్తే, ఒక కాలెండర్ ఇయర్లో భారత్ తరఫున అత్యధిక టీ20 అంతర్జాతీయ పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలుస్తాడు. ఈ రికార్డును కూడా 2022లో 31 మ్యాచ్‌ల్లో 1,164 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ యే సృష్టించారు. ఇదే ఫామ్‌లో ఈ ఏడాది అభిషేక్ శర్మ 31 మ్యాచ్‌ల్లో 852 పరుగులు చేసి విరాట్ కోహ్లీ (2022లో 781 పరుగులు) రికార్డును వెనక్కి నెట్టగా, గత ఏడాది 21 మ్యాచ్‌ల్లో 859 పరుగులు సాధించాడు.
తాజావార్తలు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
-
BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
-
CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!