Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
షేర్-ఈ-పంజాబ్ టీ20 లీగ్ 2026 ప్రారంభ మ్యాచ్‌లోనే అమృతసార్ సూర్మస్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. మొహాలీ కింగ్స్ కెప్టెన్ రమన్ దీప్ సింగ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, అమృతసార్ కెప్టెన్ అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. ఓపెనర్ సహజ్ ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన అభిషేక్, తొలి వికెట్‌కే శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సహజ్ కేవలం 18 బంతుల్లోనే 45 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అతడు అవుట్ అయ్యే సమయానికి అమృతసార్ జట్టు 5.1 ఓవర్లలోనే 100 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఆ తర్వాత కూడా అభిషేక్ శర్మ తన విధ్వంసాన్ని కొనసాగించాడు. పవర్‌ప్లే చివరి బంతికి ఫోర్ కొట్టి కేవలం 17 బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ముఖ్యంగా ఆయుష్ గోయల్ వేసిన ఐదో ఓవర్లో ఏకంగా 6 సిక్సర్లు బాది మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచాడు. మొత్తంగా 26 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ 296కి పైగా స్ట్రైక్ రేట్‌తో 77 పరుగులు చేశాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌లో 7 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. మొదటి వికెట్‌కు వంద పరుగుల భాగస్వామ్యం తర్వాత, నమన్ ధీర్‌తో కలిసి రెండో వికెట్‌కు 42 పరుగులు జోడించాడు. చివరకు హర్‌ప్రీత్ బ్రార్ వేసిన 9వ ఓవర్ మూడో బంతికి అభిషేక్ అవుటయ్యాడు.
Also Read
- 9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
- Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
అనంతరం నమన్ ధీర్ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతడు 22 బంతుల్లో 5 సిక్సర్లు, 1 ఫోర్ సాయంతో 47 పరుగులు చేసి, తేజ్‌ప్రీత్ సింగ్ బౌలింగ్‌లో అవుటై తృటిలో అర్ధశతకాన్ని చేజార్చుకున్నాడు. 14వ ఓవర్ మూడో బంతికి రాహుల్ కుమార్ రూపంలో నాలుగో వికెట్ పడేసరికి అమృతసార్ స్కోరు 211 పరుగులకు చేరింది. ఆ సమయంలో ఇంకా 39 బంతులు మిగిలి ఉండటంతో జట్టు స్కోరు 280 దాటుతుందని భావించారు. అయితే చివరి ఓవర్లలో మొహాలీ కింగ్స్ బౌలర్లు వరుస వికెట్లు తీసి పుంజుకున్నప్పటికీ, అమృతసార్ సూర్మస్ నిర్ణీత ఓవర్లలో 258 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
-
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
-
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!