NTV Telugu Site icon

Aadi Srinivas : కేటీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయి

Aadi Srinivas

Aadi Srinivas

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయన్నారు. బతుకమ్మ చీరలపై ప్రజలకు క్షమాపణలు చేయాల్సింది పోయి నేతన్నల పై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన మండిపడ్డారు. సీఎం మొగోడే కాబట్టి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ప్రజా పాలన అందిస్తున్నాడని ఆయన అన్నారు. కేటీఆర్ మాట్లాడే దురహంకార పొగరు మాటలను ప్రజలు చీత్కకరిస్తున్నా కూడా మారడం లేదని ఆది శ్రీనివాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ చీరలపై బిఆర్ఎస్ పెట్టి వెళ్లిన 197 కోట్ల రూపాయల బఖాయలను కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చిందని, నీమీద కోపం ప్రజలను మభ్యపెట్టినందుకు, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినందుకు కోపమన్నారు. ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ నాయకులను నిందించండం మానుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మారచారు కాబట్టే ప్రజలు ఎంపీ ఎన్నికల్లో పక్కకు పెట్టారని ఆయన అన్నారు.

 Devara: అందరి ఎదురుచూపులు అందుకే!

అంతేకాకుండా..’ఎనిమిది కోట్ల మీటర్లతో కోటి ముప్పై లక్షల చీరలను ఇచ్చే ప్రయత్నం చేస్తామని ప్రకటన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ప్రజలతో మమేకమై పోతుందనే ఈర్ష్య తో అబధ్ధాలు మాట్లాడుతున్నారు. కేటీఆర్ తండ్రి కేసీఆర్ అసెంబ్లీలో ఎందుకు మౌన మునిగా మారారు. .మేము హైడ్రాతో హైడ్రామా చేయడంలేదు.ప్రభుత్వ భూములను కాపాడుతున్నాము. రాబోయే రోజులలో ప్రభుత్వానికి సంబంధించిన యూనిఫాం ఆర్డర్లను నేతన్నలకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. మీపై కోపంతో కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు ఆపడం లేదు.ప్రజలకు మీపై కోపం ఉంది. మీ హయాంలో ఈ జిల్లాలో జరిగిన అక్రమాలు, అవకతవకలపైన జవాబు చెప్పాల్సి ఉంది.’ అని ఆది శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు.

Bilkis Bano Case: గుజరాత్‌ సర్కార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు