టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ ఈ మధ్య వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. హిట్, ప్లాపులతో ప్లాపులతో సంబంధం లేకుండా ఏదొక విధంగా ప్రేక్షకులను పలకరిస్తూ వస్తున్నాడు.. తాజాగా తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం మూడు సినిమాలను లైన్ లో పెట్టిన ఆది సాయి కుమార్.. తాజాగా మరో సినిమా స్టార్ట్ చేసారు. సూపర్ హిట్ కాంబోని రిపీట్ చేస్తూ ఆడియన్స్ ముందుకు వస్తున్నారు..
గతంలో చుట్టాలబ్బాయి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు వీరభద్రమ్ చౌదరితో కలిసి మరో సినిమాను చెయ్యనున్నాడు ఆది..మళ్లీ విలేజ్ డ్రామా, ఫ్యామిలీ, లవ్, కామెడీ, ఫీల్ గుడ్ ఎమోషన్ ఇలా అన్ని అంశాలతో సినిమాను చేస్తున్నారు. ఈ మూవీని లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తూము నరసింహా, జామి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.. నేడు పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభించారు..
ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ సాయి కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.. ఇక ఆది సాయికుమార్, దిగంగనా సూర్యవంశీ, మురళీధర్ గౌడ్, 30 ఇయర్స్ పృధ్వీ, రఘు బాబు, అవినాష్, రచ్చ రవి, అశ్విని, శ్రీ దేవి, అలేక్య, స్నేహ, పద్మ, గిరిధర్, గోవర్ధన్, మాస్టర్ రిత్విక్, వెంకట్ నారాయణ, గురు రాజ్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమా రెగ్యులర్ షూట్ ను జూన్ నుంచి ప్రారంభించనున్నారు.. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు..