Terrifying Video : పులిని అడవి రాజు అని పిలుస్తారు.. ఎందుకంటే దానికి ఆకలైందంటే ఎన్నో జంతువులను తన పంజాతో చీల్చి తినేస్తుంది. వేటాడేటప్పుడు పులి దాని పూర్తి శక్తితో దాడి చేస్తుంది. పులి దాడి చేసే సమయంలో బాధిత వ్యక్తి లేదా జంతువు ఏమాత్రం కదలలేడు. గతంలో టైగర్ ఎటాక్ వీడియోలు ఎన్నో చూసి ఉంటారు. కానీ తాజా వీడియో చూసి చాలామందికి చెమటలు పట్టాయి. ఈ వీడియో మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించబడింది. ఈ వీడియో పలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఏనుగు బలహీనంగా, అనారోగ్యంగా ఉందని తెలుసుకున్న పులి వెంటనే దానిని వేటాడుతుంది.
Read Also:SSC Supplementary Exams: టెన్త్ ఫలితాలు విడుదల.. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పడంటే..?
వీడియోలో ఒక బాలుడు ఏనుగుపై స్వారీ చేస్తూ పెద్ద గడ్డి మైదానం నుండి బయలుదేరుతున్నాడు. అతను ఏనుగుపై ఎక్కినప్పుడు, అతని రెండు చేతుల్లో కర్రలు ఉన్నాయి. అతను ఏనుగుపై స్వారీ చేస్తూ, ఒక పర్యాటకుడిని అడవి చుట్టూ తిప్పుతున్నాడు. అకస్మాత్తుగా పులి ఏనుగుపైకి దూకింది. ఈ వీడియో చూసిన చాలా మంది షాక్ అయ్యారు. ఇప్పటి వరకు పులి అనేక సార్లు దాడులు చేసింది. కానీ తొలిసారిగా ఈ విధంగా దాడికి సంబంధించిన వీడియోను చూశామని నెటిజన్లు సోషల్ మీడియాలో తెలిపారు.
Read Also:Karnataka Elections: ఖర్గేను చంపేందుకు బీజేపీ ప్లాన్.. కాంగ్రెస్ సంచలన ఆరోపణలు..
ఏనుగు, బాలుడి దగ్గరికి పులి వచ్చిన ఈ వీడియో నిజంగా భయానకంగా ఉంది. ఎటాక్ చేసేంతవరకే ఆ వీడియోలో రికార్డైంది. ఈ వీడియోపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. @TerrifyingNatur ఖాతా ద్వారా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Wait for tiger .. 😲😱 pic.twitter.com/Pv5r1HiSVD
— Terrifying Nature (@TerrifyingNatur) May 1, 2023