SSC Supplementary Exams: ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ ఫలితాలను విడుదల చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.. మొత్తంగా 72.26 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.. గత ఏడాది కంటే ఉత్తీర్ణత శాతం పెరిగింది.. పదవ తరగతి ఫలితాల్లో ఈసారి కూడా సత్తా చాటారు బాలికలు.. ఈ ఏడాది బాలికల్లో ఉత్తీర్ణత 75.38 శాతం.. బాలురుల్లో ఉత్తీర్ణత 69.27 శాతంగా ఉంది.. ఇక, 933 స్కూళ్లల్లో వంద శాతం పాస్.. 38 స్కూళ్లల్లో సున్నా శాతం ఫలితాలు.. ఫలితాల్లో టాప్ లో పార్వతీపురం మన్యం జిల్లా 85 శాతం ఉత్తీర్ణత.. లాస్ట్‌లో నంద్యాల జిల్లా ఉత్తీర్ణత 60.39 శాతం.. ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 95.25 శాతం ఉత్తీర్ణత ఉంది.. మరోవైపు ఫెయిలైన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు ప్రకటించారు మంత్రి బొత్స.. దీని కోసం ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఇక, ఈ ఏడాది పరీక్షల్లో తప్పిన విద్యార్థుల కోసం స్కూళ్ళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు మంత్రి బొత్స.. మరోసారి చదివి పాస్ అయ్యేందుకు ఈ క్లాస్‌లు దోహదపడతాయని తెలిపారు.. ఈ నెల 13వ తేదీలోగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ అవకాశం ఉందని తెలిపారు.. అయితే, గత ఏడాది కంటే ఈ ఏడాది ఉత్తీర్ణత 5 శాతం పెరిగిందని తెలిపారు.. జీరో ఫలితాలు వచ్చిన స్కూళ్ల సంఖ్య కూడా తగ్గిందన్నారు.. గత ఏడాది 70 స్కూళ్లలో జీరో ఫలితాలు వచ్చాయని.. ఈ సారి ఆ సంఖ్య 38కి తగ్గిందన్నారు.. ఇదే సమయంలో ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉత్తీర్ణత శాతం పెరిగింది.. 80.88 శాతం మంది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు పాస్ అయ్యారని పేర్కొన్నారు..
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల మెరుగైన ఫలితాలు వచ్చాయని తెలిపారు మంత్రి బొత్స.. పరీక్షలు పూర్తి అయిన 18 రోజుల్లో ఫలితాలను విజయవంతంగా విడుదల చేశామన్నారు.. రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఎలాంటి లీకేజీలు లేకుండా మొత్తం ప్రక్రియ నిర్వహించామన్నారు.. ఈ ప్రక్రియలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది అందరికీ అభినందనలు తెలియజేశారు.. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని.. భావోద్వేగాలకు లోనై విద్యార్థులు అఘాయిత్యాలకు పాల్పడవద్దని ధైర్యం చెప్పారు.. మీరు మళ్ళీ విజయం సాధిస్తారు… ప్రతి ఓటమి గెలుపునకు బాట వేస్తుందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.