మనలో చాలామంది తమ అవసరాలకు అనుగుణంగా ఇంటిలో ఉండే వస్తువులతో అనేక కొత్త ఆవిష్కరణలు చేస్తూ కొందరు ఆశ్చర్యపరుస్తుంటారు. మనం వాటిని చూసినప్పుడు ఒక్కోసారి మన కళ్లను మనమే నమ్మలేము. కొన్నిసార్లైతే అసలు ఇలాంటి ఆలోచనలు ఎలా పుట్టుకొస్తాయో అని అనుకుంటూ.. ఇన్నాళ్లూ మనకు ఈ సంగతి తెలియలేదే.. అని బాధ పడుతుంటాము. తాజాగా సోషల్ మీడియాలో ఇలాంటి వీడియో ఒకటి వైరల్ గా మారింది.
ఈ వైరల్ అవుతున్న విడియోలో ఓ ప్రెజర్ కుక్కర్ నుంచి విజిల్ రాగానే అక్కడ యువతి చేసిన పని చూస్తే నిజంగా ఆశ్యర్యపోవాల్సిందే. బాగా వేడిగా ఉన్న ప్రెజర్ కుక్కర్ ను ఉపయోగించి ఆ యువతి ఏకంగా ఇంట్లో వారి దుస్తులను ఇస్త్రీ చేయడాన్ని వీడియోలో మనం గమనించవచ్చు. ప్రెజర్ కుక్కర్ నుంచి ఓ విజిల్ రాగానే వెంటనే యువతి స్టవ్ మీద నుంచి కుక్కర్ దించి, దానిని తీసుకుని పక్కనే ఉన్న గదిలోకి పరిగెత్తింది. ఆపై కుక్కర్ సాయంతో మఞ్చమ్ మీద ఉన్న షర్ట్ ను ఇస్త్రీ చేస్తుంది.
Read Also: Medak Crime: ఇష్టం లేకున్నా చిన్న వయసులో పెళ్లి చేశారని చిన్నారి ఆత్మహత్య
ఇందుకు సంబంధించిన వైరల్ వీడియోను చూసిన యూజర్స్ రకరకాలుగా వారి స్టైల్ లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కేవలం 17 సెకన్లు ఉన్న ఈ వీడియోను ఇప్పటివరకు ఒక లక్షా యాభై వేల మందికి పైగా వీక్షించారు. అంతేకాదు వేల సంఖ్యలో యూజర్లు ఈ వీడియోను లైక్ చేశారు. వీడియో సంబంధించి ఓ నెటిజన్ ‘ఈవిడ సృజనాత్మకతకు వందనం’ అంటూ అని రాయగా., మరొక నెటిజన్ ‘ఈ కొత్త ఇస్త్రీపెట్టె నూతన ఆవిష్కరణను’ వెంటనే ఆమె పేటెంట్ తీసుకోవాలి అంటూ చెప్పుకొచ్చారు.
प्रिय दीदी जी को दंडवत प्रणाम 🙏 pic.twitter.com/ux2XkGpMSX
— Shubhangi Pandit (@Babymishra_) March 12, 2024