జమ్మూలో ఘోర ప్రమాదం జరిగింది. యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి దాదాపు 150 అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో 7 మంది మృతి చెందగా.. 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. యాత్రికులతో నిండిన బస్సు యూపీలోని హత్రాస్ నుంచి జమ్మూ కాశ్మీర్‌లోని శివ్ ఖోడికి వెళుతోంది.