Road Accident: గుజరాత్లో ఘోర ప్రమాదం.. ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొన్న కారు, 10 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్ హైవేపై నదియాడ్ సమీపంలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ ను ఓ కారు వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. వారిలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
Read Also: Delhi Crime: దారుణం.. స్క్రూడ్రైవర్‌తో పొడిచి భార్య, బావమరిదిని హత్య చేసిన భర్త
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
మృతుల్లో ఒక మహిళ కూడా ఉంది. సమాచారం అందుకున్న ఎమర్జెన్సీ 108, పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. వెంటనే సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరగడంతో అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు.. ప్రమాదంలో మృతి చెందిన మృతదేహాలను కారులో నుంచి బయటకు తీయడానికి కొందరు స్థానికులు పోలీసులకు సహకరించారు. ఈ ప్రమాదంలో మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి. వారిని గుర్తుపట్టలేనంత స్థితిలో ఉన్నారు. ఈ క్రమంలో.. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
#WATCH | Ahmedabad, Gujarat: 10 people died in a road accident that took place on Vadodara-Ahmedabad Expressway. pic.twitter.com/rIGVpgppQK
— ANI (@ANI) April 17, 2024
Read Also: KTR : సివిల్స్‌లో తెలుగుతేజాలు.. అభినందించిన కేటీఆర్
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!