Viral : చిన్న పొరపాటు.. బ్రతికున్న మనిషిని చంపేశారు రైల్వే పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వికారాబాద్ జిల్లా తాండూరులో చోరీకి గురైన ఫోను ఆ కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేసింది. ఫోను చోరీ చేసిన వ్యక్తి రైలు కింద పడి చనిపోవడంతో బతికున్న వ్యక్తి చనిపోయినట్లుగా భావించారు. అంత్యక్రియల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. కడసారి చూపు చూ చూసేoదుకని బంధువులు మిత్రులు అందరూ వచ్చేశారు. అంత్యక్రియలకు తరలించేందుకు పాడి ఎక్కించే సమయంలో అసలు వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. అది చూసి కుటుంబ సభ్యులు బంధువులు అంతా అవాక్కైపోయారు. వివరాలలోకి వెళితే…. బషీరాబాద్ మండలం నా వంద్గి గ్రామానికి చెందిన పిట్టల ఎల్లప్ప (45) పశువుల కాపరిగా పనిచేసేవాడు. రెండు రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయాడు. అయితే అతడి వద్ద ఉన్న సెల్ ఫోన్‌ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించాడు. ఫోన్ దొంగిలించిన వ్యక్తి వికారాబాద్ సమీపంలో రైలు కిందపడి చనిపోయాడు. అతడి మొఖం పూర్తిగా చిద్ర మైపోయి ఎవరు గుర్తుపట్టలేని విధంగా తయారయింది. రైల్వే పోలీసులు గమనించి అతడి వద్ద ఐడెంటిటీ కోసం తనిఖీ చేయగా ఫోన్ లభించింది. ఆ ఫోన్ నెంబర్ ఆధారంగా నావంద్గీ గ్రామానికి చెందిన పిట్టల ఎల్లప్ప కుటుంబ సభ్యులకు రైల్వే పోలీసులు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు వెళ్లి పరిశీలించిన గుర్తుపట్టలేని విధంగా శవం ఉండడంతో కుటుంబ సభ్యులుఇంటికి తీసుకువచ్చారు.
Also Read
ఎల్లప్ప చనిపోయిన విషయం బంధుమిత్రులందరికీ సమాచారం అందించారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు గుంతను తవ్వి అంత సిద్ధం చేశారు. నావంద్గి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి చనిపోయాడ నుకున్న పిట్టల ఎల్లప్ప తాండూరులో తారసపడ్డాడు. అతనిని చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. దగ్గరికి వెళ్లి అతడిని పలకరించాడు. నువ్వు చనిపోయావు అనుకుని ఎవరిదో శవాన్ని తీసుకువచ్చి మీ కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారని చెప్పడంతో అతడు అవ్వక్కయ్యాడు. అదే వ్యక్తితో కుటుంబ సభ్యులకు ఫోన్ చేయించి తాను బతికి ఉన్నట్లు తెలిపాడు. హుటాహుటిన గ్రామానికి వెళ్లి పోయాడు. చనిపోయాడు అనుకున్న వ్యక్తి ప్రత్యక్షం కావడంతో బంధుమిత్రులు కుటుంబ సభ్యులు గ్రామస్తులు అంత అవాక్కైపోయారు. వెంటనే వికారాబాద్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!