kitchen tips: చపాతీ కర్రకు బూజు పడుతోందా? ఈ చిన్న ట్రిక్‌తో ఫంగస్‌కు చెక్ పెట్టండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
kitchen tips: ఇంట్లో ప్రతిరోజూ చపాతీలు, పూరీలు చేసుకోవడానికి మనం ఉపయోగించే చెక్క చపాతీ కర్ర (Rolling Pin) విషయంలో చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల లేదా కడిగిన తర్వాత సరిగ్గా ఆరబెట్టకపోతే చెక్క చపాతీ కర్రలపై బూజు (Fungi), కంటికి కనిపించని సూక్ష్మక్రిములు (Germs) సులభంగా చేరిపోతాయి. ఇలాంటి చపాతీ కర్రను అలాగే ఉపయోగించి వంట చేయడం వల్ల కాలేయం, జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అయితే ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా ఇంట్లోనే నాచురల్ చపాతీ కర్రను ఎలా క్లీన్ చేసుకోవాలో, క్రిమిరహితంగా ఎలా మార్చుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సహజసిద్ధమైన క్లీనింగ్ ప్రాసెస్ ఇదే..
మొదట చపాతీ కర్రపై కొద్దిగా నీళ్లు చల్లి, ఆపై కొంచెం రాతి ఉప్పు వేయాలి. ఈ ఉప్పు చెక్క చుట్టూ బాగా తగిలేలా చేత్తో గట్టిగా రుద్దాలి. రాతి ఉప్పులో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు చెక్కపై పేరుకుపోయిన జిడ్డును, పిండి మురికిని వదిలిస్తాయి. ఉప్పుతో బాగా రుద్దిన తర్వాత శుభ్రమైన నీటితో ఆ చపాతీ కర్రను పూర్తిగా కడిగేయాలి. తర్వాత కడిగిన వెంటనే ఒక పొడి క్లాత్‌తో తుడిచి, ఆపై స్టవ్ వెలిగించి మంటపై చపాతీ కర్రను కొద్ది దూరం నుంచి వేడి చేయాలి. చుట్టూ తిప్పుతూ కాసేపు వేడి చేయడం వల్ల చెక్క రంధ్రాలలో దాగి ఉన్న తేమ పూర్తిగా ఆరిపోతుంది. ఇలా మంటపై వేడి చేయడం వల్ల లోపల దాగి ఉన్న సూక్ష్మక్రిములు, ఫంగస్ పూర్తిగా నశించిపోతాయి.
Also Read
- Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
- Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
చపాతీ కర్రను కడిగిన తర్వాత ఎప్పుడూ చీకటిగా ఉండే క్యాబినెట్లలో లేదా డ్రాయర్లలో వెంటనే పెట్టకూడదు. గాలి తగిలే చోట లేదా ఎండలో కాసేపు ఉంచడం వల్ల బూజు పట్టకుండా ఉంటుంది. నెలకు ఒకసారి ఈ చిన్న ట్రిక్ ఉపయోగించడం ద్వారా 100 శాతం చపాతీ కర్రను క్రిములు లేకుండా, సరికొత్తగా మార్చుకోవచ్చు. మీ వంటింట్లో కూడా ఈ చిట్కాను ఒకసారి ట్రై చేసి చూడండి.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..