ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సెకండ్ పార్ట్ అద్భుతమైన విజయం సాధించడమే కాదు అనేక రికార్డులు సైతం బద్దలు కొట్టింది. ఇప్పుడు అల్లు అర్జున్ తర్వాతి సినిమా ఏది ఉంటుందో అని ఎప్పటినుంచో చర్చలు జరుగుతున్నాయి. అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ తో చేయబోతున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ తో ఆయన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురం లో లాంటి సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. అయితే ఈసారి వీరు చేయబోయే సినిమా రొటీన్ సినిమా కాదని సోషియో మైథలాజికల్ ఫాంటసీ సినిమా అని తెలుస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మురుగన్ గా పిలుచుకునే కార్తికేయ అనే మహాశివుడి కుమారుడి పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.
Samantha: ముందులా లేదు.. అంతా మారిపోయింది.. విడాకులపై సమంత కామెంట్స్
ఒకసారి ఆయనకు దూరమై ఆయనకు దగ్గర అయ్యే జర్నీని సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.. ఇప్పటికే ఈ సినిమా గురించి నాగవంశీ ఒకసారి మాట్లాడారు. ఈ సినిమా గత సినిమాల లాగా ఉండదని చాలా ఎక్కువ స్పాన్ ఉన్న సినిమా కావడంతో ప్రీ ప్రొడక్షన్ కి చాలా సమయం తీసుకుంటుందని చెప్పకొచ్చారు. ఇప్పుడు లీక్ అవుతున్న సమాచారం కూడా దానికి సరిపోలే విధంగా ఉండటంతో దాదాపుగా ఇదే కదా ఫిక్స్ అయిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక అల్లు అర్జున్కి తన కెరీర్లో ఇది 22వ సినిమా.. పుష్ప దెబ్బతో మార్కెట్ భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో ఈ సినిమా మీద కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు నార్త్ ఆడియన్స్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియన్స్ అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.