Robbery: దొంగలు బాగా తెలివి మీరారు. ప్రతిరోజూ దోచుకోవడానికి కొత్త మార్గాలను కనుగొంటున్నారు. పట్టపగలు చేసే దొంగతనాలకు సీనియర్ సిటిజన్లే బాధితులు అవుతున్నారు. తాజాగా నాసిక్‌లో ఇదే తరహా దోపిడీ వెలుగులోకి వచ్చింది. బ్యాంకులో డబ్బులు తీసుకుని బయటకు వచ్చిన ఓ సీనియర్ సిటిజన్ నుంచి కొద్ది క్షణాల్లో నగదు దోచుకెళ్లారు. నాసిక్‌లో జరుగుతున్న దొంగతనాలు అక్కడ కలకలం రేపుతున్నాయి. బ్యాంకు బయట ఇలాంటి దొంగతనం జరగడంతో పౌరులు బ్యాంకుతో పాటు పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Also: Father Shocking Decision : కొడుకు పెళ్లి చేసి అప్పులపాలైన తండ్రి.. షాకింగ్ డెసిషన్
బోధాలే నగర్‌లోని ఓ బ్యాంకు నుంచి సీనియర్ సిటిజన్ రూ.53 లక్షలు విత్‌డ్రా చేశారు. అతడు తన వెంట తెచ్చుకున్న బ్యాగ్‌లో ఈ నగదును ఉంచుకుని బ్యాంకు పార్కింగ్ స్థలంలోకి వచ్చాడు. ఇంతలో బ్యాగ్ అక్కడున్న పార్క్ చేసిన బైకు హ్యాండిల్ కు చిక్కుబడిపోయింది. ఇంతలో అక్కడే కారులో కూర్చున్న ముగ్గురు నలుగురు వ్యక్తులు సహాయం కోసం వృద్ధుడి వద్దకు వచ్చారు. సాయం కోసం వచ్చినట్లు నటించారు. అతడి బ్యాగు పట్టుకుని.. కారు కింద డబ్బులు పడిపోయాయని మాటల్లోకి దించారు. అతడు ఆ డబ్బుల వైపు చూస్తుండగానే.. మరొక వైపు దోపిడీ కోసం వచ్చిన వారిలో ఒకడు బ్యాగ్ విసిరేశాడు. రెప్పపాటులో అక్కడి నుంచి ఉడాయించారు. బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
Read Also: Gyanvapi Case: జ్ఞానవాపి కేసులో శివలింగం కార్బన్ డేటింగ్‌పై స్పష్టత ఇవ్వాలని కోర్టు ఆదేశం