Fire Accident In Train: గ్యాస్ లీకేజీ కావడంతో.. ఆగి ఉన్న రైల్వే కోచ్‌లో భారీ అగ్నిప్రమాదం
- రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌లో లుని రైల్వే స్టేషన్‌లోని క్యాంపింగ్ కోచ్‌లో.
- అకస్మాత్తుగా మంటలు వ్యాప్తి.
- గ్యాస్ లీకేజీ కావడంతో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident In Train: రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌లో లుని రైల్వే స్టేషన్‌లోని క్యాంపింగ్ కోచ్‌లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఈ కోచ్ రైల్వే కార్మికులకు చెందినది. అందులో వారు ఆహారం వండుతున్నారు. వంట చేస్తుండగా గ్యాస్ లీకేజీ కావడంతో మంటలు చెలరేగడంతో కోచ్‌లో ఉన్న ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. మంటలు చెలరేగడంతో స్టేషన్‌లో గందరగోళం నెలకొనడంతో మంటలను అధికారులు ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ కోచ్ జోధ్‌పూర్ – లూని సెక్షన్ మధ్య ట్రాక్ లపై పనిచేసే ఉద్యోగుల కోసమేనని రైల్వే అధికారులు తెలిపారు. రైలుకు కోచ్ కనెక్ట్ కాకపోవడంతో మంటలు చెలరేగడంతో పెద్ద ప్రమాదం జరగలేదు. అయితే, కోచ్‌లో రెండు గ్యాస్ సిలిండర్లు ఉంచి ఉండడంతో వాటిని బయటకు తీయలేకపోవడంతో పేలుడు ప్రమాదం పొంచి ఉంది.
Also Read
- USA: ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే.. అమెరికాలో ఏపీకి చెందిన టెక్కీ మృతి..
- Public Wi-Fi Risks: ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్, హోటళ్లు.. ఇలా పబ్లిక్ Wi-Fiకి కనెక్ట్ అవుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- Prakash Raj: "నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు".. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
- AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే లూని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలైనట్లు సమాచారం లేదు. మంటలను త్వరగా అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని రైల్వే స్టేషన్ అధికారులు తెలిపారు. పోలీసులు, రైల్వే అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది పాత కండం కోచ్ అని, అది లాక్‌లో ఉందని జోధ్‌పూర్ రైల్వే డివిజన్ మేనేజర్ పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. అగ్నిప్రమాదం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పాత కోచ్ రైలు మార్గంలో నిలబడి ఉంది. ఆ ప్రాంతంలో జరుగుతున్న రైల్వే పనుల్లోని ఉద్యోగులు దీనిని క్యాంపింగ్ కోచ్‌గా ఉపయోగిస్తున్నారు. మధ్యాహ్నం అందులోనే ఆహారం వండుతున్నారు. ఈ సమయంలో మంటలు చెలరేగాయి.
Read Also: Most Expensive Rice: భూమి మీద అత్యంత ఖరీదైన బియ్యం ఎక్కడ పండిస్తారంటే? ఒక్క కిలో ధర ఏకంగా వేలల్లో..
जोधपुर के लूणी रेलवे स्टेशन पर खड़े रेलवे डिब्बे में खाना बनाते समय लगी आग, फायर ब्रिगेड मौके पर। @AshwiniVaishnaw pic.twitter.com/yFRrctgGUx
— Dr. Ashok Sharma (@ashok_Jodhpurii) November 13, 2024
తాజావార్తలు
-
USA: ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే.. అమెరికాలో ఏపీకి చెందిన టెక్కీ మృతి..
-
Public Wi-Fi Risks: ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్, హోటళ్లు.. ఇలా పబ్లిక్ Wi-Fiకి కనెక్ట్ అవుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
-
Hero – Director : హిట్స్ కోసం కొత్త రూట్ వెతుకుతున్న హీరోలు, దర్శకులు
-
Vaibhav Sooryavanshi: మైదానంలోనే కాదు మార్కెట్లోనూ వైభవ్ జోరు.. 15 ఏళ్లకే కోట్లలో సంపాదన!
-
Prakash Raj: “నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు”.. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?