Site icon NTV Telugu

Delhi: ఢిల్లీలోని పాకిస్థాన్‌ హైకమిషన్‌లో సంబరాలు.. కేక్ తీసుకెళ్తున్న వ్యక్తి (వీడియో)

Pak

Pak

పహల్గామ్ దాడి తర్వాత.. భారతదేశం పాకిస్థాన్‌పై అనేక కఠినమైన చర్యలు తీసుకుంది. పాకిస్థాన్‌లోని తన రాయబార కార్యాలయాన్ని మూసివేయాలని భారతదేశం నిర్ణయించింది. అలాగే.. భారతదేశంలోని పాకిస్థాన్ దౌత్యవేత్తలను 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. ఇంతలో పాకిస్థాన్ హైకమిషన్ నుంచి ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి పాకిస్థాన్ హైకమిషన్‌లోకి కేక్ తీసుకెళ్తున్నట్లు కనిపిస్తుంది.

READ MORE: Tilak Varma: ముంబై ఇండియన్స్‌లో ఇప్పటివరకు విన్నింగ్ ఫీల్‌ను పొందలేదు!

ఢిల్లీలోని హైకమిషన్ లోనికి కేక్ తీసుకెళ్తున్న వ్యక్తిని చూసిన మీడియా సిబ్బంది.. “కేక్ ఎందుకు తీసుకున్నారు? ఎందుకు సంబరాలు జరుపుకుంటున్నారు. కేసు తీసుకెళ్లడానికి కారణం ఏంటి?” అని ప్రశ్నించారు. కానీ, ఆ వ్యక్తి ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నేరుగా లోపలికి వెళ్తాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ కేక్‌ను ఎవరు ఆర్డర్ చేసారు? ఈ సమయంలో ఎందుకు సంబరాలు జరుపుకుంటున్నారు? అసలు కేక్ తీసుకెళ్తున్న వ్యక్తి ఎవరు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి రూపం, వేషదారణ చూస్తే అతడు ముస్లిం వర్గానికి చెందిన యువకుడిలా కనిపిస్తున్నాడు.

READ MORE: Buggana Rajendranath Reddy: సంపద సృష్టి తక్కువ.. అప్పులు ఎక్కువ..! కూటమి ప్రభుత్వంపై బుగ్గన ఫైర్‌

నెటిజన్లు ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. పాకిస్థాన్ దుష్ట చర్యల గురించి చర్చించుకుంటున్నారు. కొంతమంది దీనిని పహల్గామ్ దాడికి కూడా లింక్ చేస్తున్నారు. దేశంలో ఇంత బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు.. పాకిస్థాన్ హైకమిషన్‌లో కేకుతో సంబరాలు జరుపుకోవడం పాకిస్థాన్ కుట్రను బహిర్గతం చేస్తుంది. అయితే.. ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లో కేక్ ఆర్డర్ చేశారని ఒక యూజర్ రాశారు. ఇంకా సోదర భావం ఎందుకు కొనసాగించాలి? అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Exit mobile version