Viral Video: కష్టం లేని వ్యక్తి ప్రపంచంలో ఉండడు. కొన్ని కష్టాలను ఎదుర్కోలేక కొంతమంది ప్రాణాలను వదిలేస్తారు. ఇంకొంతమంది కుటుంబాన్ని గాలికి వదిలేసి వెళ్ళిపోతారు. మరికొంతమంది ప్రాణం విలువ, కుటుంబం విలువ తెలియక చిన్న చిన్న వాటికే ఆత్మహత్యలు చేసుకొని తీరని శోకాన్నిమిగులుస్తారు. కానీ, కొంతమంది జీవితాలు.. వారి బాధలు చూస్తే వీరికన్నా మనమే బెటర్ కదా అనిపిస్తూ ఉంటుంది.. వారి కష్టం ముందు మనం పడుతుంది కూడా ఒక కష్టమా అని అనిపించక మానదు. ప్రస్తుతం మనం చూస్తున్న వీడియో కూడా అలాంటిదే. పొట్ట కూటి కోసం.. ఎలాంటి పని కన్నా సిద్దమయ్యేవారిని చూస్తే లైఫ్ అందరికి ఒకేలా ఉండదు అని అనిపించక మానదు. ఈ వీడియోలో ఒక వ్యక్తి.. ఒక బైక్ ను నెత్తిమీద పెట్టుకొని నిచ్చెన ఎక్కుతూ బస్సు పైన పెడుతున్నాడు. సాధారణంగా వీరిని కూలీలు అని అంటారు.
బస్సులు, ట్రైన్స్ వద్ద ఎక్కువ లగేజ్ ఉంటే కారు వద్దకు తీసుకురావడం.. బస్సు కింద ఉన్న సామానులను బస్సుపైకి ఎక్కించడం చేస్తూ ఉంటారు. ఇంత చేసిన వారికి వచ్చే జీతం మహా అయితే రూ. 100.. రోజు మొత్తంలో ఆ వంద రూపాయల కోసం అంత బరువు ఉన్న బైక్ ను ఎటువంటి సపోర్ట్ లేకుండా అతను మోసుకెళ్ళడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసాకా మన జీవితం ఇంతకంటే కష్టమైనదా..? అని తమకు తామే ప్రశ్నించుకోవడంలో అతిశయోక్తి లేదు. ఈ వీడియో ఎక్కడది అని తెలియదు కానీ ప్రస్తుతం నెట్టింట మాత్రం వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన వారు.. గుండెలను పిండేస్తోంది అని కామెంట్స్ చేస్తున్నారు.
మీ జీవితం ఇంత కంటే కూడా కష్టమైనదా….???
నాకైతే అలా అనిపించట్ల….
Thank to God always to, what you have now… pic.twitter.com/7aqskLb9bP
— Dharani (@DharaniBRS) January 15, 2023