Monkeys Attack on 5 Years kid kishan Viral Video : ఉత్తరప్రదేశ్ లోని మధురలో తాజాగా ఓ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా ఐదేళ్ల బాలుడు పై అందరూ చూస్తుండగానే.. కోతులు భయంకరంగా దాడి చేశాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను అక్కడే ఉన్న సిసిటివి కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. జులై 12 శుక్రవారం నాడు మధురలోని బృందావనం ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన సమయంలో రక్షించేందుకు స్థానికులు పరిగెత్తుకొచ్చినట్లు కూడా వీడియోలో కనిపిస్తుంది. ఈ సంఘటనలో కోతులతో గాయపడ్డ బాలుడి పేరు కిషన్. పిల్లాడికి ఘటన జరిగిన సమయంలో పని నిమిత్తం అతని తండ్రి గోపాల్ ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు.
ఆ బాలుడు ఇంటి దగ్గర్లోని ఆలయం మెట్ల దగ్గరకు చేరుకున్న వెంటనే అబ్బాయి పై కోతులు ఒక్కసారిగా దాడికి దిగాయి. దీంతో కిషన్ ఆలయం మెట్ల నుండి కింద పడిపోయాడు. కోతుల దాడితో అతడు బిత్తరపోయాడు. చుట్టుపక్కల ప్రజలు అబ్బాయి కోసం రాకపోయింటే మాత్రం మరో దారుణమే జరిగేది. నడిరోడ్డుపై కొన్ని కోతులు అతనిపై దాడి చేసి ఒక్కసారిగా నేలపై పడేసాయి. కింద పడిన తర్వాత కూడా అబ్బాయిని ఈడ్చడానికి ప్రయత్నం చేసినట్లుగా వీడియోలో స్పష్టంగా కనబడుతుంది. ఈ దాడిలో అబ్బాయి కిషన్ కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తున్నారు.
Ram Setu: రామసేతు వంతెన నిజమే.. ఫోటోలు విడుదల చేసిన ఇస్రో..!
దాడి జరుగుతున్న సమయంలో పక్కనే కొంతమంది మహిళలు ఉన్న ఆ బాలుడిని రక్షించేందుకు ధైర్యం చేయలేకపోయారు. దాంతో ఆ కోతులు బాలుడిని రోడ్డుపై లాగి దాడి చేశాయి. అలా కొన్ని సెకన్ల తర్వాత పక్కనే ఉన్న కొందరు యువకులు పరుగున వచ్చి బాలుని రక్షించారు. వారు కోతులను గట్టిగా బెదిరించగా.. కోతులు బాలుడిని వదిలిపెట్టి వెళ్ళిపోయాయి. దీంతో ఆ బాలుడు వేగంగా లేచి ఇంటి వైపు పరుగులు పెట్టాడు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. కాబట్టి ఇంట్లోని చిన్న పిల్లలు ఏదైనా పని కోసం బయటికి వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది.
मथुरा में बंदरों का आतंक, 5 साल के मासूम बच्चे पर बंदरों ने किया अटैक, स्थानीय लोगों ने दौड़कर बचाई बच्चे की जान, लाइव घटना सीसीटीवी में कैद@dmmathura7512 pic.twitter.com/nUjbATcbd0
— Pramod Kumar (@journalistpk123) July 13, 2024