Site icon NTV Telugu

Asian Games 2023: భారత్కు పతకాల పంట.. కబడ్డీలో గోల్డ్ మెడల్ సాధించిన ఇండియా

Kabaddi

Kabaddi

ఆసియా క్రీడలు 2023 టోర్నీలో భారత్ హవా కొనసాగిస్తుంది. ఇరాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత పురుషుల కబడ్డీ జట్టు స్వర్ణం గెలిచింది. తీవ్ర ఉత్కంఠ నడుమ 33-29 పాయింట్ల తేడాతో పసడి సాధించారు. హాఫ్ టైమ్ ముగిసే సమయానికి 17-13 పరుగుల తేడాతో మంచి ఆధిక్యంలో నిలిచిన టీమిండియా.. సెకండ్ హాఫ్‌లో ఇరాన్ ఊహించని విధంగా పునరాగమనం చేశారు. దీంతో 19-24 స్కోరు నుంచి 25-25 పాయింట్లతో స్కోర్లను సమం చేసింది. ఆ తర్వాత ప్రతీ పాయింట్ కోసం ఇరు జట్ల మధ్య ఉత్కంఠ నెలకొంది.

Hamas Attack On Israel: “ఈ దాడి గర్వంగా ఉంది”.. హమాస్ ఉగ్రవాదులకు ఇరాన్ మద్దతు..

ఇదిలా ఉంటే.. మరో 65 సెకన్లలో ఆట ముగుస్తుందని పవన్ చేసిన రైడ్ విషయంలో ఇరు జట్ల మధ్య గొడవ జరిగింది. డూ ఆర్ డై రైడ్‌కి వెళ్లిన పవన్, డిఫెండవర్లు ఎవ్వరినీ తాకకముందే లాబీలోకి ఎంటర్ అయ్యాడు. అయితే అతన్ని అవుట్ చేసేందుకు ప్రయత్నించిన ఇరాన్ డిఫెండర్లు ముగ్గురు లాబీలోకి ఎంటర్ అయ్యారు. ఈ రైడ్‌పై ఇరాన్‌కి ఒక్క పాయింట్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు రిఫరీ. అయితే భారత్ రివ్యూ తీసుకోవడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. దీనిపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆటకు కాసేపు అంతరాయం కలిగిన తర్వాత అంపైర్లు, భారత్‌కి 3 పాయింట్లు, ఇరాన్‌కి ఒక్క పాయింట్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఇరాన్ అసంతృప్తి వ్యక్తం చేసింది.

Dussehra Holidays: మారిన దసరా సెలవులు.. ప్రభుత్వం కీలక ప్రకటన

దీంతో దాదాపు గంటకు పైగా మ్యాచ్ ఆగిపోయింది. భారత్, ఇరాన్ అధికారులు.. అంపైర్లతో చర్చించిన తర్వాత భారత్‌కి 3 పాయింట్లు ఇవ్వడంతో మ్యాచ్ తిరిగి 31-29 దగ్గర ప్రారంభమైంది. డూ ఆర్ డై రైడ్‌కి వచ్చిన ఇరాన్ రైడర్‌ని టీమిండియా ఔట్ చేయగా.. ఆ తర్వాత ఆఖరి రైడ్‌లో మరో పాయింట్ చేశారు. దీంతో భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం దక్కింది. 1990, 1994, 1998, 2002, 2006, 2010, 2014 ఏసియన్ గేమ్స్‌లో స్వర్ణ పతకాలు గెలిచిన భారత కబడ్డీ పురుషుల జట్టు, గత ఏషియన్ గేమ్స్‌లో మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేక కాంస్యంతో సరిపెట్టుకుంది. ఈసారి మరోసారి భారత కబడ్డీ జట్టు స్వర్ణంతో కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఇదిలా ఉంటే.. భారత మహిళా కబడ్డీ జట్టు కూడా స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే.

Exit mobile version