Crime News: స్నేహితుడి భార్యపై కన్ను.. నరికి చంపిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భార్యను వేధించాడని స్నేహితుడిని అతి దారుణంగా చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని నది ఒడ్డున పాతిపెట్టాడు. మృతుడి మొబైల్ ద్వారా వివరాలు సేకరిస్తారని దానిని బావిలో పడేశాడు. మృతుడు సైన్యంలో పనిచేసి రిటైరయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. గుమ్లా జిల్లాలోని రైదీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రుక్రూమ్ గ్రామంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది.
AUS vs BAN: బంగ్లాను చిత్తుచేసిన ఆస్ట్రేలియా.. 8 వికెట్ల తేడాతో గెలుపు
Also Read
- NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్‌స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
- Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
- PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
- UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
పోలీసుల వివరాల ప్రకారం.. రిటైర్డ్ సైనికుడు రంజీత్‌తో తనకు ఏళ్ల తరబడి స్నేహం ఉందని నిందితుడు రమేష్ ఓరాన్ చెప్పాడు. అయితే మద్యం మత్తులో రంజీత్ తన భార్యను వేధించాడని నిందితుడు ఆరోపించాడు. అందుకోసమని అతనిపై పగ తీర్చుకునేందుకు ఓ ప్లాన్ చేసినట్లు తెలిపాడు. అతను తన సోదరుడు దయానంద్ ఓరాన్‌తో కలిసి రంజిత్‌ను చంపాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాడు. ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో.. ఏదో సాకుతో రమేష్ అతడికి ఫోన్ చేసి రమ్మని మద్యం తాగించాడు.
Israel-Hamas War: అంధకారంలో గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి.. మరణం అంచున శిశువులు..
ఆ తర్వాత మద్యం మత్తులో నిందితుడు రంజీత్‌ను పలుగు, కర్రతో కొట్టి హత్య చేశాడు. హత్య చేసిన తరువాత మృతదేహాన్ని నది ఒడ్డున గొయ్యి తవ్వి పూడ్చిపెట్టాడు. తాము పట్టుబడతామనే భయంతో నిందితుడు మృతుడి ఫోన్‌ను ఓ బావిలో పడేశాడు. అంతేకాకుండా.. మృతుడి బైక్ ను అడవిలో దాచిపెట్టాడు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, మృతుడి దుస్తులపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న గుమ్లా జిల్లా ఎస్పీ హర్విందర్ సింగ్ నేతృత్వంలో సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు మృతుడి స్నేహితుడు రమేష్ ఓరాన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో రమేష్ ఒరాన్ తన సోదరుడు దయానంద్ ఓరాన్‌తో కలిసి మొత్తం నేరాన్ని అంగీకరించాడు.
తాజావార్తలు
-
Warren Buffett: తండ్రి స్థానంలో కొడుకు.. వారెన్ బఫెట్ సామ్రాజ్యానికి కొత్త రారాజు ఇతడే!
-
Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
-
NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్‌స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
-
Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
-
PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..