Site icon NTV Telugu

CM Chandrababu: జిల్లాల పునర్విభజనపై టీడీపీ పొలిట్ బ్యూరోలో చర్చ..

Cm Chandrababu

Cm Chandrababu

టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. పలు అంశాలపై చర్చ పోలిట్ బ్యూరోలో చర్చ జరిగింది. మహానాడు రెండు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. కడప జిల్లాలో మహానాడు నిర్వహించనున్నారు. జిల్లాల పునర్విభజన పై పొలిట్ బ్యూరోలో చర్చ జరిగింది. వైసీపీ హయాంలో స్థానిక సంస్థల్లో తగ్గిన బీసీ కోటా రిజర్వేషన్ పునరుద్ధరించేలా చట్టపరమైన అంశాలు పరిశీలించాలని సీఎం చంద్రబాబు సూచించారు. మహానాడు తర్వాత రాష్ట్ర, కేంద్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. జగన్ ప్రభుత్వ నిర్వాకం వల్ల Frbm లిమిట్ సున్నా అయిందన్నారు. గత ఎనిమిది నెలల్లో రాష్ట్రానికి ఆరున్నర లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినా.. ప్రజల్లోకి విషయాన్ని తీసుకెళ్లటంతో మంత్రులు, ఎమ్మెల్యేలు విఫలమవుతున్నారని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. 2014-19మధ్య జరిగిన తప్పిదాలు పునరావృతం కాకూడదని సూచించారు.

READ MORE: Health Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? జున్ను vs టోఫు రెండింట్లో బెస్ట్ ఏదో తెలుసా?

తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు ఈ ఏడాదే ప్రారంభించాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అన్నదాత సుఖీభవ కేంద్రం 6వేలే ఇచ్చినా మిగిలిన 14వేలు రాష్ట్ర ప్రభుత్వమే భరించి 3విడతల్లో రూ.20వేలు చెల్లిద్దామన్నారు. రాష్ట్ర ఆదాయం పెంచే మార్గాలు అన్వేషిస్తున్నామని తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టు నిధులు పీపీపీ మోడల్ లో రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం కాంట్రాక్టర్లు 50 శాతం పెట్టుకునేలా ప్రణాళికలు చేద్దామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకునే 50శాతం నిధుల్లో సగమైనా కేంద్రాన్ని అడుగుదామన్న ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

READ MORE: Health Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? జున్ను vs టోఫు రెండింట్లో బెస్ట్ ఏదో తెలుసా?

Exit mobile version