టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. పలు అంశాలపై చర్చ పోలిట్ బ్యూరోలో చర్చ జరిగింది. మహానాడు రెండు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. కడప జిల్లాలో మహానాడు నిర్వహించనున్నారు. జిల్లాల పునర్విభజన పై పొలిట్ బ్యూరోలో చర్చ జరిగింది. వైసీపీ హయాంలో స్థానిక సంస్థల్లో తగ్గిన బీసీ కోటా రిజర్వేషన్ పునరుద్ధరించేలా చట్టపరమైన అంశాలు పరిశీలించాలని సీఎం చంద్రబాబు సూచించారు.