Navdeep: 23 ఏళ్లలో రకరకాల మనుషులను ప్రేమించా.. అలాంటి అమ్మాయే కావాలి: నవదీప్ ఇంటర్వ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hero Navdeep Interview for Love Mouli: సూపర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ సరికొత్త అవతార్‌లో నవదీప్ 2.Oగా కనిపించబోతున్న చిత్రం ‘లవ్,మౌళి’. ఈ విభిన్నమైన, వైవిధ్యమైన చిత్రానికి ఎస్.ఎస్. రాజమౌళి శిష్యుడు అవనీంద్ర దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు, ప్రమోషన్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచగా… నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో కలిసి టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్‌కి అడ్డాగా మారిన సి స్పేస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవల సింగిల్ కట్ లేకుండా సెన్సారును పూర్తిచేసుకున్న ఈ చిత్రం సెన్సార్ నుండి ‘ఏ’ సర్టిఫికెట్‌ను సొంతం చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్ 7న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర విశేషాలను హీరో నవదీప్ మీడియాతో పంచుకున్నాడు ఆ విశేషాలివి..
నా కెరీర్ ప్రారంభమైనప్పుడు.. మంచి జెట్‌స్పీడులో వెళ్లింది. వరుసగా చేసుకూంటూ వెళ్లాను. ఆ తరువాత అన్ని తరహా పాత్రలు చేశాను. ఇప్పుడు జనాల నా గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకున్నాను. వాళ్లు నా గురించి ఆలోచించే తరహాలో మార్పు వున్నప్పుడు మనం కూడా మరాలి అనిపించింది. అందుకే నాకు కూడా వాళ్ల ఆలోచన తగిన విధంగా కెరీర్‌ను మార్చకోవాలినిపించింది. ఆ తరుణంలో విన్న కథే లవ్,మౌళి. ఈ సినిమా కోసం అన్ని మార్చుకున్నాను. నా తపన కూడా నా స్నేహితులకు కూడా అర్థం చేసుకుని ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.
Also Read
- GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
- Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
- NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
ఈ సినిమా షూటింగ్ మొత్తం మేఘాలయాలోని చిరపుంజీలో చేయడం పెద్ద సాహసం అని చెప్పాలి. ఎన్నో వ్యయ ప్రయాసాలతో షూటింగ్ చేశాం. ఎప్పూడు వర్షం పడే ఆ ప్లేస్‌లో సినిమా మీద పాషన్‌తో చిత్రీకరణ చేశాం. రెండున్నర సంవత్సరాలు నేను కూడా అదె గెటప్‌లో వున్నాను. సినిమా కోసం అందరం కష్టపడి తీశాం. లవ్ మౌళి సినిమా మేకింగ్ అంతా ఓ సాహసం అని చెప్పాలి.
సరదాగా హీరో రానాకు కథ చెప్పాను. కథ బాగుందని చెప్పి ఈ సినిమాలో రానా అఘోరాగా ఒక ముఖ్యపాత్రను చేశాడు. అంతేకాదు నా కోసం ఎదైనా చెయ్యాలని చెప్పి రానా ఈ పాత్రను చేశాడు. నిజంగా చెప్పాలంటే రానాకు ఈ పాత్ర చేయడం అవసరం లేదు. నాతో వున్న స్నేహంతో పాటు పాత్ర చేశాడు. ఈ రోజు వరకు కూడా రానా ఈ చిత్రం చేశాడని రివీల్ చేయలేదు. ఎందుకంటే దీనిని కమర్షియల్‌గా వాడుకోవడం ఇష్టం లేదు. ఈ సినిమాలో ఈ పాత్రను రానా చేయకపోతే మా దర్శకుడు చేసేవాడు.
ఇది రెగ్యులర్ లవ్‌స్టోరీ కాదు. ఈ సినిమా అందరికి కొత్త అనుభూతినిస్తుంది. ఈ సినిమాలో ఏ విషయంలో కూడా రొటిన్‌గా వుండదు. ఈ సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా యూత్‌కు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా తెలుగులో కాకుండా మరో భాషల్లో వచ్చి వుంటే చూసే కోణంలో కూడా తేడా వుండేదెమో.. ఈ సినిమా అందరికి ఎక్కడో ఒక దగ్గర కనెక్ట్ అవుతుది.
ఈ సినిమా కోసం నేను, దర్శకుడు సింక్‌లో వుండి ప్రిపేర్ అయ్యాం. నేను ఏ సినిమా చేసినా ఆ పాత్రకు తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యే వాడిని. ఈ సినిమాతో విజయం నా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నాను.
ఈ సినిమాలో నేపథ్యం సంగీతం హైలైట్ అని చెప్పాలి. సన్నివేశానికి ఎలివెట్ చేసే విధంగా చాలా మంచి పాటలతో పాటు నేపథ్య సంగీతం ఇచ్చాడు. ఈ సినిమాకు నేపథ్య సంగీతం ప్రాణం పోసింది. లవ్‌మౌళి ఎక్స్‌పీరియన్స్ అందరికి కొత్త అనుభూతిని ఇస్తుంది.
హీరోయిన్ పాత్ర కోసం చాలా మందిని చూసి పంకూరిని సెలక్ట్ చేశాం. చిత్రం క్యారెక్టర్‌కు ఆ అమ్మాయి బాగా కుదిరింది. దర్శకుడు తను అనుకున్న పాత్ర కోసం సరైన ఆర్టిస్ట్ దొరికే వరకు ఎక్కడా రాజీపడలేదు. కొత్త అమ్మాయిని కాకుండా సీనియర్ హీరోయిన్ పెట్టే పాత్ర కాదు. ఈ రోజు సినిమాకు పంకూరి ఎంతో ప్లస్ అయ్యింది.
పర్సనల్‌గా నన్నునన్నుగా వుండనిచ్చే అమ్మాయి నాకు కావాలనిపిస్తుంది.
నేను పూర్తిగా దర్శకుడికి నమ్మాను. సినిమా మొత్తం ఆయన విజనే వదిలేశాను. కేవలం నా గెటప్ పాత్ర గురించి మాత్రమే నేను కేర్ తీసుకున్నాను. ఇది ప్రేమలో వున్న మనిషికి నిజమైన ప్రేమ గురించి వెతికే పాత్ర నాది. ఈ సినిమాలో నా పాత్రలో డిఫరెంట్ ఎమోషన్స్ వుంటాయి.
సినిమా చూసిన కపుల్స్‌కు ఎక్కడో ఒక్క దగ్గర సినిమాకు రిలేట్ అవుతారు. కొత్తగా పెళ్లైన వాళ్లకు, బాయ్‌ఫ్రెండ్స్ కు ఎక్కడో ఒక్క దగ్గర తగులుతుంటాయి.
నా రియల్‌లైఫ్‌లో ఎన్నో ప్రేమకథలు వున్నాయి. 23 ఏళ్ల నుండి రకరకాల మనుషులను ప్రేమించాను. పర్సనల్‌గా కూడా ఈ సినిమా కథ నాకు ఎంతో కనెక్ట్ అయ్యింది. సినిమా దర్శకుడు కూడా తన వ్యక్తిగత అనభవాలు ఈ సినిమాలో వున్నాయి. అతని ఆలోచనలకు దగ్గర ఈ సినిమా వుంటుంది. మనం ఏంటో తెలుసుకుని ప్రశాంతంగా వుండి.. అవతలి వాళ్లను కూడా ప్రశాంతంగా వుంచితే.. బాగుంటుంది.
న్యూసెన్స్ 2 వెబ్‌సీరిస్‌తో పాటు తమిళంలో నిత్యమీనన్‌తో ఓ సినిమా చేస్తున్నాను. దీంతో పాటు మరికొన్ని వెబ్‌సీరిస్‌లు రిలీజ్‌కు సిద్దంగా వున్నాయి. ఇక నుంచి సోలో హీరోగా మంచి కథలతో రావాలనుకుంటున్నాను. లవ్, మౌళికి వచ్చిన స్పందన బట్టి నా తదుపరి చిత్రాల ఎంపిక ఆధారపడి వుంటుంది. దర్శకుడు అవనీంద్ర, నా కాంబినేషన్‌లో కూడా మరో సినిమా చేద్దామని అంటున్నారు. నాకు మాత్రం ఒక పూర్తి వినోదాత్మక సినిమా చేయాలని వుంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడి విధ్వంసం”.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
-
Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!