TTD: సరోగసీ విధానం ద్వారా జన్మించిన ఆవు.. ఏపీలో ఇదే తొలిసారి, టీటీడీ ఈవో ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD: ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతం జరిగింది. సరోగసీ తల్లి ఆవు ద్వారా మరో ఆవు జన్మించింది. ఏపీలో ఇలా ఆవిష్కృతం కావడం ఇదే తొలిసారి అని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. కొత్తగా పుట్టిన ఆవుకు ‘పద్మావతి’గా నామకరణం చేశామన్నారు. గిర్ ఆవు పిండం.. ఒంగోలు ఆవు గర్భంలో ప్రవేశ పెట్టడం జరిగిందని చెప్పారు. దేశీయ ఆవు పాల ఉత్పత్తి చేయాలన్నదే తమ లక్ష్యమని, తద్వారా వెన్న, నెయ్యిని అధికంగా ఉత్పత్తి చేయవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం 3.8 కోట్లు టీటీడీ ద్వారా ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీకి ఇచ్చినట్లు ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. రానున్న ఐదేళ్లలో మరిన్ని ఆవులను సరోగసీ విధానం ద్వారా పుట్టించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు టీటీడీ అధికారులు.
Also Read: America: 16నెలల చిన్నారిని ఇంట్లో పెట్టి 10రోజులు పరారైన తల్లి.. తిరిగొచ్చే సరికి దారుణం
Also Read
- Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
- Khairatabad Ganesh Immersion: ముగిసిన ఖైరతాబాదు వినాయకుడి శోభయాత్ర.. గంగమ్మ ఒడిలోకి చేరుకున్న బడా గణపయ్య.!
- iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
- Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే "బీరకాయ రోటి పచ్చడి" చేసేయండిలా..!
ఏపీలో మొదటిసారి సరోగసీ తల్లి ఆవు ద్వారా మరో ఆవు జన్మించడం సంతోషమని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. దేశీయ ఆవులు అంతరించిపోతున్న నేపథ్యంలో సరోగసీ విధానం ద్వారా ఆవులను అభివృద్ధి చేస్తున్నామని ధర్మారెడ్డి చెప్పారు. గో ఆధారిత వ్యవసాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, 11 ఆవులకు ఎంబ్రియో ఆవులు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఏడాదికి 94 సరోగసీ ఆవు దూడలు పుట్టించేందుకు సిద్ధం చేశామని, సాహివాల్ ఎంబ్రీయో ఆవులను ఒంగోలు జాతి ఆవులలో అభివృద్ది చేసినట్లు తెలిపారు. రోజుకు 60 కిలోల నెయ్యి శ్రీవారి ఆలయంలో అవసరం ఉందని, స్వచ్ఛమైన పాలను స్వామివారు, అమ్మవారికి అందించాలనే ఉద్దేశంతో దేశీయ ఆవులను అభివృద్ధి చేస్తున్నట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఇప్పటికే 200 దేశీయ గోవులను దాతలు సమకూర్చారని, మరో 300 గోవులను సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
Also Read: Surekha Vani: డ్రగ్స్ కేసు.. దయచేసి నన్ను.. నా కుటుంబాన్ని నాశనం చేయకండి
శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పద్మనాభ రెడ్డి మాట్లాడుతూ.. స్వదేశీ ఆవుల సంతతి పెంచుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉందన్నారు. ఐఈవీఈ టెక్నాలజీ ద్వారా ఒక ఆవు నుంచి పది నుంచి 15 వరకు పిండాలు సేకరించి అద్దె గర్భం ఆవుల్లో ప్రవేశపెడుతున్నామని చెప్పారు. సరోగసీ ద్వారా అధిక పాలు ఉత్పత్తి చేయడం ద్వారా 530 ఆవు దూడలు, మొదటి ఏడాది 36 ఆవు దూడలు పుట్టించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు పద్మనాభ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
IND vs WI: రుతురాజ్, నితీష్ ఇన్.. ఆ ఇద్దరు స్టార్లకు నో ఛాన్స్.. వెస్టిండీస్‌తో తొలి వన్డేకు భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
-
D56 : నాగవంశీ – ధనుష్ – తమిళరసన్ పచ్చముత్తు.. మొదలుపెట్టారు
-
Khairatabad Ganesh Immersion: ముగిసిన ఖైరతాబాదు వినాయకుడి శోభయాత్ర.. గంగమ్మ ఒడిలోకి చేరుకున్న బడా గణపయ్య.!
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
ట్రెండింగ్
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!