Video Call : బెంగుళూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. వీడియో కాల్‌లో భార్యను చూపించలేదన్న కోపంతో ఓ వ్యక్తి సహోద్యోగిపై కత్తెరతో దాడి చేశాడు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని హెచ్‌ఎస్ఆర్ లేఅవుట్‌లో నివాసిస్తున్న సురేష్ వర్మ, వెంకట్ పురలో ఉండే రాజేష్ మిశ్రాలు ఓ బట్టల షాపులో సేల్స్ మెన్స్ గా పని చేస్తున్నారు. మంగళవారం రాజేష్ మిశ్రా తన భార్యతో వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలో సురేష్ వచ్చాడు. అతడి భార్యను చూపించమని అడిగాడు. అయితే, ఇందుకు రాజేశ్ ఒప్పుకోలేదు.
Read Also: Rat Stole Necklace: ఖరీదైన నెక్లెస్ పై కన్నేసిన ఎలుక.. ఎవరూ లేనిది చూసి ఎత్తుకుపోయింది
ఇదే విషయమై ఇద్దరూ గొడవపడ్డారు. ఈ క్రమంలో సురేష్ రెచ్చిపోయాడు.. రాజేశ్ మిశ్రాను కత్తెరతో పొడిచాడు. అనంతరం అక్కడి నుండి పరారయ్యాడు. అది గమనించిన సహోద్యోగులు రాజేశ్ ను ఆస్పత్రికి తరలించారు. దీనిపై రాజేశ్ ఫిర్యాదుతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు. ఐపీసీ సెక్షన్ 324, 504 కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. సురేశ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. స్టేషన్ బెయిల్ పై రిలీజ్ చేశారు.
Read Also:Four Day Work Week: వారానికి నాలుగురోజుల పని సక్సెస్.. ఉద్యోగులు హ్యాపీ.. పెరిగిన ఉత్పాదకత