Rat Stole Necklace: మనుషులే బంగారపు నెక్లెస్ లు వేసుకోవాలా… ఏం మేం వేసుకుని మంచిగా రెడీ కావొద్దా అనుకుందేమో ఈ ఎలుక నగల దుకాణంలోకి వెళ్లి ఎవరూ లేనిది చూసి నెక్లెస్ దొంగిలించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది కేరళ రాష్ట్రం కాసర్ గడ్ లోని ఓ ప్రముఖ నగల దుకాణంలో ఈ ఘటన జరిగింది. అమ్మకానికి కొన్ని నెక్లెస్ లను కస్టమర్లకు కనిపించే విధంగా డిస్ ప్లే లో పెట్టారు. అయితే, సడెన్ గా ఓ నగ ఉన్నట్టుండి మాయమైంది. దీంతో షాపు సిబ్బంది కంగారు పడ్డారు. ఆ నగ కోసం వెతకడం ప్రారంభించారు. షాప్ మొత్తం వెతికారు. కానీ, ప్రయోజనం లేకపోయింది.
Read Also: Madan Mitra: ఒకే భార్యకు ఐదుగురు.. టీఎంసీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
దీంతో ఆ షాపు యజమాని సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాడు. అందులో కనిపించిన దృశ్యం చూసి ఓనర్ సహా సిబ్బంది షాక్ అయ్యారు. వారి నోట మాట రాలేదు. నెక్లెస్ చోరీ వాస్తవమే. కానీ, ఓ ఎలుక ఖరీదైన నెక్లెన్ ను ఎత్తుకెళ్లినట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. అర్థరాత్రి.. షాపు సీలింగ్ నుంచి ఓ ఎలుక బయటకు వచ్చింది. సరిగ్గా దాని కన్ను అక్కడే డిస్ ప్లే లో ఉంచిన బంగారు నెక్లప్ పై కన్నుపడింది. ఆ నెక్లెస్ పై దానికి మోజు కలిగిందో మరో కారణమో తెలియదు కానీ, క్షణం కూడా ఆలస్యం చేయలేదు. దాన్ని నోట కరుచుకుని అక్కడి నుంచి మాయమైంది. ఎలుక చేసిన పని చూసి అంతా షాక్ అయ్యారు. ఖరీదైన నెక్లెస్ ను ఎలుక ఎత్తుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. వాలెంటైన్స్ డే దగ్గర పడింది కదా.. ఆ ఎలుక తన లవర్ కి గిఫ్ట్ గా ఇచ్చేందుకు ఇలా నగను చోరీ చేసి ఉంటుందని ట్వీట్ చేస్తున్నారు.