Family Star: దేవరకొండను కించపరుస్తున్నారు.. పోలీసులకు ఫిర్యాదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ . ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకొచ్చి ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణతో సక్సెస్ ఫుల్ గా ఆడుతోంది. ఇకపోతే., కొందరు వ్యక్తులు, అలాగే కొన్ని సోషల్ మీడియా గ్రూప్స్ పనిగట్టుకుని మరీ ఈ సినిమాకు విజయం దక్కకూడదని, విజయ్ దేవరకొండకు పేరు రాకూడదని ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థమవుతుంది. ఇక ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ కు ముందే సినిమా మీద నెగిటివ్ పోస్టులు చేశారు కొందరు.
Also read: Ramcharan Vaction: థాయ్‌లాండ్ వెకేషన్ లో కూతురితో కలిసి ఎంజాయ్ చేస్తున్న రాంచరణ్ దంపతులు..!
Also Read
దాంతో ఈ విషయాలు కాస్త.. ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా నిర్మాణ సంస్థ ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ దృష్టికి వెళ్లడంతో.. నిర్మాణ సంస్ధ ఇచ్చిన సోషల్ మీడియా స్క్రీన్ షాట్స్, సోషల్ మీడియా గ్రూప్స్, ఇంకా అనేక అక్కౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా హీరో విజయ్ దేవరకొండ పర్సనల్ మేనేజర్ అనురాగ్ పర్వతనేని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నిషాంత్ కుమార్ కలిసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందించారు.
Also read:MI vs DC: ఢిల్లీ ముందు భారీ లక్ష్యం.. చితక్కొట్టిన ముంబై బ్యాటర్లు
కావాలని కొందరు ఫ్యామిలీ ఫ్యామిలీ స్టార్ సినిమా మీద చేస్తున్న దుష్ప్రచారం వల్ల.. ఫ్యామిలీ స్టార్ సినిమా చూడాలనుకునే ప్రేక్షకులను తప్పుదోవ పట్టిస్తున్నారని, దీంతో సినిమా వసూళ్లపై ప్రభావం పడుతోందని వారి కంప్లైంట్ లో పేర్కొన్నారు. ఇక కంప్లైంట్ అందుంకున్న నేపథ్యంలో.. ప్రాథమిక ఆధారాలు దృష్ట్యా పోలీసులు కేసు విచారించి నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు. సినిమా విషయంలో కొందరు హీరో విజయ్ మీద ద్వేషంతో ఇలా ఆయన తీసే సినిమాల మీద నెగిటివ్ సోషల్ మీడియా క్యాంపెయిన్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!