తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ . ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకొచ్చి ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణతో సక్సెస్ ఫుల్ గా ఆడుతోంది. ఇకపోతే., కొందరు వ్యక్తులు, అలాగే కొన్ని సోషల్ మీడియా గ్రూప్స్ పనిగట్టుకుని మరీ ఈ సినిమాకు విజయం దక్కకూడదని, విజయ్ దేవరకొండకు పేరు రాకూడదని ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థమవుతుంది. ఇక ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ కు ముందే సినిమా మీద నెగిటివ్ పోస్టులు చేశారు కొందరు.…