Site icon NTV Telugu

Road Accident: ఒడిశాలో ట్రక్కును ఢీకొన్న బస్సు.. 21 మందికి గాయాలు

Road Accident

Road Accident

Road Accident: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జాతీయ రహదారి-16పై ఘోర ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కును బస్సు ఢీకొనడంతో నేపాల్‌కు చెందిన 20 మంది యాత్రికులు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. సోరో పోలీస్ స్టేషన్ పరిధిలోని తాలానగర్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 61 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆగిఉన్న ట్రక్కును.. బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై బాలాసోర్ సదర్ సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) శశాంక శేఖర్ బ్యూరా మాట్లాడుతూ.. ఒక దాబా సమీపంలో నిలబడి ఉన్న ట్రక్కును ఉదయం 5 గంటల ప్రాంతంలో టూరిస్ట్ బస్సు ఢీకొట్టిందని తెలిపారు. ఆ బస్సులో ప్రయాణిస్తున్న నేపాల్ కు చెందిన 20 మంది యాత్రికులు సహా 21 మందికి గాయాలయ్యాయి.

Read Also: Rajasthan News: నిద్రపోతున్న తమ్ముడిని కత్తితో పొడిచి చంపిన అన్న.. పంట విషయంలో ఘర్షణ

గాయపడిన వారందరినీ సోరో ఆసుపత్రికి తరలించామని, నేపాల్ యాత్రికులు చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. అయితే బస్సు డ్రైవర్ పరిస్థితి విషమించడంతో బాలసోర్ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించినట్లు SDPO తెలిపారు. టూరిస్ట్ బస్సు ఉత్తరప్రదేశ్‌కు చెందినదని, డ్రైవర్ కూడా ఆ రాష్ట్రానికి చెందినవాడని పోలీసు అధికారి తెలిపారు. అయితే గాయపడ్డ వారికి ఆహారం, నీటి ఏర్పాట్లు చేసి వారిని గమ్యస్థానానికి పంపించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అయితే టూరిస్ట్ లు జగన్నాథుని దర్శనం కోసం పూరీకి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని యాత్రికులు చెబుతున్నారు.

Read Also: IND vs AUS: భారత్ స్పిన్ మాయాజాలం.. ఆస్ట్రేలియా ఆలౌట్‌! టీమిండియా టార్గెట్ ఎంతంటే?

Exit mobile version