IND vs AUS: భారత్ స్పిన్ మాయాజాలం.. ఆస్ట్రేలియా ఆలౌట్! టీమిండియా టార్గెట్ ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Australia 199 all out after Ravindra Jadeja, Kuldeep Yadav heroics: చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023 ఆరంభ మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగారు. ముఖ్యంగా స్పిన్నర్లు విజృంభించడంతో.. ఆస్ట్రేలియా మోస్తరు స్కోరుకే పరిమితమైంది. 49.3 ఓవర్లకు 199 పరుగులు చేసి ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. దాంతో భారత్ టార్గెట్ 200గా ఉంది. ఆసీస్ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (41), స్టీవ్ స్మిత్ (46) టాప్ స్కోరర్లు. భారత స్పిన్నర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్స్ తీయగా.. కుల్దీప్ యాదవ్ 2, ఆర్ అశ్విన్ ఒక వికెట్ పడగొట్టాడు. పేసర్ జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్స్ తీశాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ డకౌట్ అయ్యాడు. ఈ సమయంలో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ జట్టును ఆదుకున్నారు. హాఫ్ సెంచరీఐ చేరువకు వచ్చిన వార్నర్‌ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేశాడు. దాంతో ఆసీస్ పతనం మొదలైంది. కుల్దీప్ సహా జడేజా మాయాజాలానికి స్మిత్, మార్నస్ లబుషేన్ (27), అలెక్స్ కారీ (0), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (15) వెంటవెంటనే ఔట్ అయ్యారు. కామరూన్ గ్రీన్ (8) కూడా క్రీజులో నిలవలేకపోయాడు.
Also Read
Also Read: IND vs AUS: జార్వో బాబాయ్ మళ్లీ వచ్చేశాడు.. భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు అంతరాయం! రంగంలోకి కోహ్లీ
ఆస్ట్రేలియా 140 పరుగులకే 7 వికెట్స్ కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో కెప్టెన్ పాట్ కమిన్స్ (15), పేసర్ మిచెల్ స్టార్క్ (28) పోరాడటంతో ఆసీస్ ఆ మాత్రమైనా పరుగులు చేయగలిగింది. ఆడమ్ జంపా, జోష్ హేజిలీవుడ్ నిరాశపరిచారు. జడేజా (3/28), కుల్దీప్ (2/42), అశ్విన్ (1/34), బుమ్రా (2/35) ఆసీస్‌ను కట్టడి చేశారు. అయితే హార్దిక్ పాండ్యా 3 ఓవర్లలో 28 రన్స్ ఇచ్చి కాస్త నిరాశపరిచాడు. మరికాసేపట్లో భారత్ ఇన్నింగ్స్ మొదలవుతుంది.
Innings break!
Australia are all out for 199 courtesy of a solid bowling performance from #TeamIndia 👏👏
Ravindra Jadeja the pick of the bowlers with figures of 3/28 👌👌
Scorecard ▶️ https://t.co/ToKaGif9ri#CWC23 | #INDvAUS | #MeninBlue pic.twitter.com/TSf9WN4Bkz
— BCCI (@BCCI) October 8, 2023
తాజావార్తలు
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!