సోషల్ మీడియా కారణంగా ప్రపంచంలో ఏ మూలన ఏ విషయం జరిగిన అది ఇట్టే అందరూ తెలుసుకోగలుగుతున్నారు. ముఖ్యంగా కొంతమంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు అనేక ప్రదేశాలను తిరుగుతూ.. ఆ ప్రదేశాలకి సంబంధించి ఉన్న అందాలని, విశేషలని ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తారు. ఇకపోతే తాజాగా ఓ భారతీయ యువతీ జపాన్ దేశంలో ఉన్న ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్ ను పరిచయం చేసింది. ఇక ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Also read: Victory Venkatesh: వెంకటేష్‌కి వింత పరిస్థితి.. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రచారం?
ప్రపంచంలో చాలా నగరాలలో మాల్స్ లేదా రైల్వే స్టేషన్ ఇంకా అనేక రద్దీ ప్రదేశాలలో మనం ఎస్కలేటర్లను సర్వసాధారణంగా ఉపయోగిస్తున్నాము. ఒకప్పుడు వీటిని ఉపయోగించడానికి చాలామంది భయపడేవారు. అయితే రాను రాను నాగరికత పెరుగుతున్న కొద్ది అందరికీ ఇవి సర్వసాధారణమైపోయాయి. దాంతో మెట్లు ఎక్కేవారందరు ఇప్పుడు ఎస్కలేటర్ ద్వారా పై ఫ్లోర్ కు, లేదా కింది ఫ్లోర్ కు చేరుకోగలుగుతున్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే.., ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్ గురించి మనం తెలుసుకుందాం.
Also read: T20 WC 2024: టీ20 వరల్డ్ కప్ లో కీలక బాధ్యతలు చేపట్టనున్న సిక్సర్ల కింగ్.. ఆఫీసియల్..
ఈ చిన్న ఎస్కలేటర్ కేవలం 5 స్టెప్స్ మాత్రమే కలిగి ఉంది. ఈ బుల్లి ఎస్కలేటర్ సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బుల్లి ఎస్కలేటర్ జపాన్ లో ఉంది. దీనిఎత్తు 83 సెం.మీ, దూరం 2.7 అడుగులు మాత్రమే.. జపాన్ లోని ఓ డిపార్ట్మెంట్ స్టోర్ లో ప్రజలు కేవలం ఐదు మెట్లు ఎక్కడానికి ఈ బుల్లి ఎస్కలేటర్ ను ఉపయోగిస్తున్నారు.