Noise Pop Buds Price: సరికొత్త టెక్నాలజీతో ‘నాయిస్ పాప్ బడ్స్’.. 50 గంటల బ్యాటరీ లైఫ్! 71 శాతం తగ్గింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Noise Pop Buds Launch and Price in India: ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ ‘నాయిస్’ భారత్‌లో మరో కొత్త ప్రొడక్ట్‌ను రిలీజ్ చేసింది. సరికొత్త టెక్నాలజీతో ‘నాయిస్ పాప్ బడ్స్’ను విడుదల చేసింది. ఈ ట్రూవైర్‌లెస్ ఇయర్ ఫోన్స్‌లో క్వాడ్ మైక్ సిస్టమ్, ఫాస్ట్ ఛార్జింగ్, IPX5 వాటర్ స్ప్లాషింగ్‌తో పాటు అనేక ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్లు అన్ని యూజర్లకు సరికొత్త అనుభూతిని అందిచనున్నాయి. ఈ బడ్స్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, నాయిస్ ఇండియా వెబ్‌సైట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి.
ఫ్లిప్‌కార్ట్‌లో నాయిస్ పాప్ బడ్స్‌ను రూ.999కి సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ సేవింగ్ డేస్’ సేల్ 2024 కొనసాగుతోంది. ఈ సేల్‌లో భాగంగా 71 శాతం తగ్గింపు అనంతరం రూ.999కి అందుబాటులో ఉంది. ఈ బడ్స్ అసలు ధర రూ.3,499గా ఉంది. ఈ అవకాశం కొద్దిరోజులు మాత్రమే ఉండనుంది. ఫారెస్ట్ పాప్, లైలాక్ పాప్, మూన్ పాప్, స్టీల్ పాప్ రంగుల్లో నాయిస్ పాప్ బడ్స్ లభిస్తోంది.
Also Read
Also Read: Nitish Reddy: డేవిడ్ వార్నర్ సరసన తెలుగు ఆటగాడు నితీష్ రెడ్డి!
అత్యాధునిక నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీతో కాల్స్ క్లారిటీ పెంచేలా క్వాడ్ మైక్ సిస్టమ్‌ను నాయిస్ పాప్ బడ్స్‌లో ఇచ్చారు. ఇది పరిసర ప్రాంతాల్లోని అనవసరపు శబ్దాలను అరికడుతుంది. మీరు మంచి క్లారితో ఫోన్ కాల్‌లను మాట్లాడుకోవచ్చు. 10 ఎంఎం డ్రైవర్స్‌ను ఇందులో ఇచ్చారు. బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ, హైపర్ సింక్ టెక్నాలజీ, గూగుల్ అసిస్టెంట్, సిరి వంటివి ఇందులో ఉంటాయి. 90 నిమిషాల్లో ఇది పూర్తిగా ఛార్జ్ అవుతుంది. 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే.. 150 నిమిషాల బ్యాటరీ లైఫ్ వస్తుంది. ఈ బడ్స్‌లో కేస్‌తో కలిపి పూర్తి ప్లేబ్యాక్ టైమ్ 50 గంటలు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు