Food Poisoning : ఉత్తర భారత దేశంలో రసగుల్లా లేకుండా ఏ శుభకార్యం జరుగదు. ఈ రసగుల్లా పేరు వింటే ఎవరికైనా నోట్లో లాలాజలం వస్తుంది. అయితే.. ఉత్తరప్రదేశ్ లో ఓ పెళ్లి వేడుకలో పెట్టిన విందులో ఏదో తేడా జరిగింది. విందు తిన్న వాళ్లంతా విరేచనాల పాలయ్యారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. కన్నౌజ్‌లోని మధర్‌పూర్ గ్రామంలో బుధవారం ఓ వివాహవేడుక జరిగింది. ఈ వేడుక విందులో భోజనం చేసిన పలువురు చిన్నారులతో సహా దాదాపు 70 మంది ఫుడ్‌పాయిజనింగ్‌కు గురయ్యారు. రసగుల్లా తిన్న బంధువులకు తీవ్రంగా వాంతులు, విరేచనాలు అయ్యాయి.
Read Also:Rohit Sharma: మాకు స్టార్లు అవసరం లేదు.. మేమే తయారు చేస్తాం..
అనంతరం వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారని స్థానికులు తెలిపారు. అదే సమయంలో ఇర్ఫాన్ ఖాన్, షాజియా, రియాజుద్దీన్, అర్జూ, అజ్రా, షిఫా, యూసుఫ్, సుల్తాన్ ఇంకా చికిత్స పొందుతున్నారు. జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శక్తి బసు మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రిలో రోగులందరి పరిస్థితి నిలకడగా ఉందని, కొందరిని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు. విందుకు హాజరైన దాదాపు అందరూ రసగుల్లాను తిన్నారని, దీంతో పలువురు అస్వస్థతకు గురయ్యారని గ్రామానికి చెందిన మున్నా తెలిపారు.
Read Also:BJP Chief JP Nadda : విదేశాల్లో ప్రధాని స్వాగతం చూసి భారతీయులు గర్విస్తున్నారు : జేపీ నడ్డా