Organ Donation: యాక్సిడెంట్.. బ్రెయిన్ డెడ్.! ఆరుగురి జీవితాల్లో వెలుగునింపిన 7 ఏళ్ల ‘యశ్వన్’.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Organ Donation: సైక్లింగ్ చేస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన 7 ఏళ్ల చిన్నారి ‘యశ్వన్’ అవయవదానంతో 6 మందికి కొత్త జీవితాన్ని ఇచ్చాడు. జూన్ 29వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు తమిళనాడులోని తిరునవెల్లి జిల్లా, చిట్టికులేం గ్రామం, అను విజయ్ టౌన్షిప్, కన్యాకుమారి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రోజూ మాదిరిగా ఇంటికి వచ్చి ఆడుకుంటున్న యశ్వన్‌కు సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. ఆడుకుంటుండగా అటుగా వచ్చిన అంబులెన్స్ రాష్‌గా డ్రైవ్ చేయడంతో యశ్వన్‌ను ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్రగాయాలు కాగా ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది.
బ్రెయిన్ డెడ్:
ఈ ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు యశ్వన్‌ను కేరళ KIMS ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి త్రివేండ్రంకు రెఫర్ చేశారు. అలా 30వ తేదీ రాత్రి శస్త్రచికిత్స చేసినా యశ్వన్ ఎలాంటి స్పందన ఇవ్వలేదు. మే 1వ తేదీ నుంచి వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగింది. కేరళ ప్రభుత్వ అధికారుల అనుమతితో బ్రెయిన్ డెడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సమయంలో యశ్వన్ అమ్మమ్మ “మనవడి అవయవాలతో ఇతరుల ప్రాణాలు కాపాడదాం” అని సూచించడంతో తల్లితండ్రులు అవయవ దానానికి అంగీకరించారు.
Also Read
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
18 గంటల్లో ఆరుగురికి అవయవాలు:
మే 5వ తేదీన యశ్వన్‌ను బ్రెయిన్ డెడ్‌గా డిక్లేర్ చేశారు. ఆ తర్వాత 18 గంటల వ్యవధిలో ‘యశ్వన్’ శరీరంలోని గుండె, కిడ్నీలు, కాలేయం, కళ్లు తదితర అవయవాలను ఆరుగురికి అమర్చారు. ఈ రోజు కేరళ నుంచి యశ్వన్ మృతదేహం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంది. అక్కడి నుంచి స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
యశ్వన్ తల్లితండ్రులు లోకినేని రఘు, లోకినేని సౌమ్య. వీరి స్వస్థలం లింగన్నపేట గ్రామం, గంభీరావుపేట మండలం, తెలంగాణ. వీరికి ఇద్దరు పిల్లలు. చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయినా యశ్వన్ తీసుకున్న ఈ నిర్ణయం సమాజానికి ఆదర్శంగా నిలిచింది. అవయవ దానంపై అవగాహన పెంచేందుకు ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలవనుంది.
తాజావార్తలు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!