సూడాన్ రాజధాని ఖార్టూమ్‌లోని దక్షిణ భాగంలో శనివారం జరిగిన వైమానిక దాడిలో ఐదుగురు చిన్నారులు సహా 17 మంది మరణించారు. ఈ మేరకు శనివారం ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
సూడాన్ లో సంక్షోభం మరింతగా ముదురుతోంది. అక్కడి ప్రజల పరిస్థితులు దయనీయంగా మారిపోయాయి. అక్కడ కొనసాగుతున్న అంతర్గత ఘర్షణల కారణాలతో ఖార్టూమ్ అనాథాశ్రమంలో 60 మంది చిన్నారులు బలయ్యారు.
ఆఫ్రికా దేశం సూడాన్‌లో సైన్యం, పారామిలిటీరీ మధ్య ఘర్షణతో అట్టుడుకుతోంది. ఆర్మీ చీఫ్ అబ్దేల్ ఫత్తా అల్-బుర్హాన్, పారామిలిటరీ కమాండర్ జనరల్ మొహమ్మద్ హమ్దాన్ దగాలో మధ్య పోరులో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. రెండు దళాల పోరు తారాస్థాయికి చేరడంతో వందలాది మంది మరణించారు.