Cold Storage Roof Collapse: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కోల్డ్ స్టోరేజీ పైకప్పు కూలిపోవడంతో ఐదుగురు మృతి చెందగా.. 30 మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన మీరట్‌లోని దౌరాలా వద్ద జరిగింది. ఘటన జరిగిన వెంటనే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందంతో పాటు సీనియర్ అడ్మినిస్ట్రేటివ్, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న 26 మందిని రక్షించారు. మరికొందరిని రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
Read Also: Couple Stuck In Lift: లిఫ్టులో చిక్కుకున్న కొత్త జంట.. ఆ తర్వాత ఏమైందంటే?
నిర్మాణంలో ఉన్న కోల్డ్ స్టోరేజీ పైకప్పు కూలిపోయిందని అక్కడ పనిచేస్తున్న కార్మికుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. చాలా మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారని సర్కిల్ ఆఫీసర్ ఆశిష్ శర్మ తెలిపారు. పోలీసులు ఇంకా బాధితులను గుర్తించలేదని, కోల్డ్ స్టోరేజీ కూలిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.