Newly Married Desi Couple Stuck In Lift For 2 Hours Misses Their Reception: పెళ్లైన కొత్త జంటలకు ఏదైనా ఒక మెమొరబుల్ మూమెంట్ ఉండాలన్న కోరికలు ఉంటాయి. అయితే.. అన్ని జంటలకు ఆ కోరిక నెరవేరకపోవచ్చు కానీ, కొన్ని జంటలకు మాత్రం చిరకాలం నిల్చుండిపోయే అనూహ్య పరిణామాలైతే తప్పకుండా చోటు చేసుకుంటాయి. ఇప్పుడు ఓ జంటకూ అలాంటి అనుభవమే ఎదురైంది. తమ రిసెప్షన్‌కి వెళుతున్న సమయంలో.. ఓ దంపుతులు లిఫ్ట్‌లోనే దాదాపు రెండు గంటల పాటు ఇరుక్కుపోయారు. తాము రిసెప్షన్‌కి చేరుకోవడం కష్టమేనని అనుకున్నారు. చివరికి సిబ్బంది రంగంలోకి దిగడంతో, వాళ్లు ఆ లిఫ్ట్ నుంచి బయటపడగలిగారు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Car Accident: హైవేపై మూడు సార్లు పల్టీలు.. నలుగురు అక్కడికక్కడే మృతి
నార్త్ కరోలినాకు చెందిన ప్రణవ్, విక్టోరియా ఝాలకు రీసెంట్‌గా పెళ్లి అయ్యింది. వీళ్లు ఫిబ్రవరి 18వ తేదీన తమ రిసెప్షన్ పెట్టుకున్నారు. షార్లెట్‌లోని గ్రాండ్ బోహెమియన్ హోటల్‌లోని 16వ అంతస్తులో రిసెప్షన్‌కు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఆ జంట తయారై, తమ రిసెప్షన్‌ను ఎంజాయ్ చేసేందుకు హోటల్‌కు వెళ్లారు. 16వ అంతస్తుకు వెళ్లడానికి లిఫ్ట్ ఎక్కారు. కానీ.. ఆ లిఫ్ట్ ఐదారడుగుల దూరం పోయిన తర్వాత ఆగిపోయింది. అంటే.. ఫస్ట్ & సెకండ్ ఫ్లోర్ మధ్య ఆగిపోయింది. ఓవైపు రిసెప్షన్‌కి వచ్చిన కుటుంబసభ్యులు, బంధువులందరూ ఈ జంట కోసం వేచి చూస్తుంటే.. వాళ్లు మాత్రం లిఫ్ట్‌లోనే ఇరుక్కుపోయారు. సిగ్నల్స్ లేని కారణంగా ఫోన్ కలవలేదు. ఇలాగే రెండు గంటలు గడిచిపోయాయి. ఏమైనా అయ్యిందేమోననుకొని ఆందోళన కుటుంబసభ్యులు.. గ్రౌండ్ ఫ్లోర్‌కి వచ్చారు. ఈ క్రమంలో కొత్త పెళ్లి జంట లిఫ్ట్‌లో ఇరుక్కున్నట్టు గుర్తించారు.
Bus Robbery: సినిమా స్టైల్‌లో బస్సులో 10 లక్షల దోపిడీ.. బైక్‌తో అడ్డగించి మరీ..
అప్పుడు వాళ్లు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. వాళ్లు వెంటనే రంగంలోకి దిగారు. అతికష్టం మీద ఆ జంటను బయటకు తీయగలిగారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవ్వరికీ, ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై ప్రణవ్ స్పందిస్తూ.. ‘‘లిఫ్ట్ ఐదారడుగుల మేర పైకి వెళ్లిన తర్వాత ఒక్కసారిగా ఆగిపోయింది. తలుపులు కూడా కొద్దిగా తెరిచి ఉన్నాయి. దీంతో, ఏదో తేడా జరిగిందన్న విషయాన్ని గుర్తించాను’’ అని చెప్పాడు. ఇది ఊహించలేని పరిణామం అని, ఏదేమైనా తాము కలిసి కాసేపు ఆ లిఫ్ట్‌లో గడిపామని, కాబట్టి ఇదొక మెమొరబుల్ మూమెంట్ అని చెప్పుకొచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Warangal Preethi Case: పూలదండ ఎందుకు తెచ్చావ్.. గవర్నర్‌ను నిలదీసిన ప్రీతి సిస్టర్