Kuwait fire: కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 41 మంది సజీవదహనం
- కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం
- 41 మంది సజీవదహనం
- మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
- మృతుల్లో ఐదుగురు భారతీయులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఎత్తైన భవనంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు భారతీయులతో సహా 41 మంది సజీవదహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
కువైట్‌లోని దక్షిణ మంగాఫ్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. 41 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని కువైట్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో భవనంలో మంటలు వ్యాపించాయి. మంటలు అంటుకుని భవనం అంతా వేగంగా వ్యాపించాయి. దీంతో చాలా మంది లోపలే చిక్కుకున్నారు. ఈ భవనంలో ఎక్కువగా కార్మికులు నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో 41 మంది మృతి చెందారని.. మరో 43 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు కువైట్ డిప్యూటీ ప్రధాని వెల్లడించారు.
Also Read
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
- Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. 'వనిత టీవీ' 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
మృతుల్లో ఐదుగురు కేరళకు చెందిన వారు ఉన్నట్లుగా సమాచారం. ఈ ఘటనపై విదేశాంగ మంత్రి జైశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక భారత రాయబార కార్యాలయం నుంచి కేంద్రమంత్రి సమాచారం సేకరిస్తున్నారు. మృతుల కుటుంబాలకు జై శంకర్ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని.. సహాయ అందిస్తామని కేంద్రమంత్రి పేర్కొన్నారు. “కువైట్ నగరంలో అగ్నిప్రమాద ఘటన వార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. 40 మందికి పైగా మరణించారని మరియు 50 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారని తెలిసింది. తదుపరి సమాచారం కోసం మేము ఎదురుచూస్తున్నాం.’’ అని జైశంకర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
మరోవైపు రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అధికారులు దగ్గర ఉండి పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. ఇక ప్రమాదానికి గల కారణాలపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. భవనంలో పెద్ద ఎత్తున కార్మికులు ఉన్నారని.. పొగ పీల్చడం వల్లే మరణాల సంఖ్య పెరిగిందని సీనియర్ పోలీస్ కమాండర్ తెలిపారు.


తాజావార్తలు
-
King : కరీనా కపూర్- షారూఖ్ ఖాన్ రీ-యూనియన్
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
-
Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!