Jyothika: ఇక్కడ ఒంటరిగా పోరాడాల్సి ఉంటుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటి జ్యోతిక గురించి పరిచయం అక్కర్లేదు. హీరోయిన్ గా తమిళ, తెలుగు భాషలో దాదాపు స్టార్ హీరోలతో జత కట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. చంద్రముఖి మూవీతో తనలోని ట్యాలెంట్‌తో ఆకట్టుకున్న ఈ చిన్నది పెళ్లి పిల్లలు ఫ్యామిలీ లైఫ్ లో బిజీ అయి ఇండస్ట్రీకి కొంత కాలం దూరంగా ఉంది. ప్రజంట్ సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించి భిన్నమైన కథలు ఎంచుకుంటున్న జ్యోతిక విజయవంతంగా కెరీర్ కొనసాగిస్తుంది. ఈ మధ్య బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టి అక్కడ కూడా మంచి మంచి అవకాశాలు అందుకుంటుంది. ఇక రీసెంట్‌గా ‘డబ్బా కార్టెల్’ వెబ్ సిరీస్ లో నటిస్తున్న జ్యోతిక ఈ సీరిస్ ప్రమోషన్‌లో భాగంగా హీరోయిన్‌ల కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
జ్యోతిక మాట్లాడుతూ.. ‘ కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే నేను వివాహ బంధం లోకి అడుగుపెట్టాను. 28 సంవత్సరాల వయస్సులోనే నేను ఇద్దరు పిల్లలకు తల్లి నయ్యాను. ఆ తర్వాత కూడా భిన్నమైన రోల్స్‌లో నటిస్తూ నేను కెరీర్‌ను కొనసాగించాను. కానీ పెళ్లి తర్వాత ఏ స్టార్ హీరో సరసన కూడా వర్క్ చేసే ఛాన్స్ నాకు రాలేదు. ఇక కొత్త డైరెక్టర్ తో వర్క్ చేయడం చాలా పెద్ద సవాల్ తో కూడుకుంది. ఆ రోజుల్లో బాలచందర్ వంటి డైరెక్టర్లు, స్టార్ ప్రొడ్యూసర్లు మహిళల కోసం సినిమాలు తీసేవారు. ప్రస్తుతం అలా ఎవరూ సినిమాలు తీయడం లేదు. ఇందుకు బడ్జెట్ ఒక కారణం అయితే ఏజ్ మరో కారణమని చెప్పాలి. దీంతో మహిళల కొరకు గొప్ప కథలు రాసేవారు తగ్గిపోయారు. అందులోను సౌత్‌లో నటిగా కొనసాగడం చాలా కష్టం, ఎందుకంటే ఇక్కడ ఒంటరిగా పోరాటం చేయాల్సి ఉంటుంది’ అని జ్యోతిక తెలిపింది. ప్రజంట్ ఆమె మాటలు వైరల్ అవుతున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Shavukaru Janaki : వెండితెర ‘షావుకారు’ జానకి ఇకలేరు.. ఏడు పదుల సినీ ప్రస్థానానికి ముగింపు
-
Earthquakes: ఒక భూకంపం మరో భూకంపాన్ని ప్రేరేపిస్తుందా? ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనల వెనుక అసలు కారణం ఇదే..!
-
Vizag Job Fraud: విశాఖలో కిలాడీ లేడీ.. నిరుద్యోగులకు కుచ్చుటోపీ!
-
Arjun Reedy Ice Scene: ‘ఐస్ వేసుకునే సీన్’ రాగానే నిర్మాతలు ఆపెయ్యమనేవాళ్లు..!
-
Spirit: ‘స్పిరిట్’లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!