తెలంగాణలో గంజాయి స్మగ్లర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడిక్కడా తనిఖీలు చేపడుతున్నారు. అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకొని మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే.. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో పరిధిలో 3 కిలోల గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వండర్లా పరిసర ప్రాంతంలో మంగల్ఘడ్ , దూల్పేట్ ,వివిధ ప్రాంతాల నుండి రాజాసింగ్, ఉప్పు లోకేష్ ఇద్దరు వ్యక్తులు గత కొన్ని రోజుల నుండి వండర్లను అడ్డగా చేసుకొని స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అక్కడి నుండి ఇబ్రహీంపట్నం, కొంగరకలాన్, ఔటర్ రింగ్ రోడ్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్నారని సమాచారం మేర నిన్న సాయంత్రం ఇద్దరిని అరెస్టు చేశామని ఆయన వెల్లడించారు.
రాజాసింగ్ ను పట్టుకొని విచారించగా ఇంజాపూర్ ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్న ఉప్పు లోకేష్ కి గంజాయి తెచ్చిస్తామని అతను చిన్న చిన్న ప్యాకెట్లు చేసి విద్యార్థులకు అమ్ముతున్నారని తెలిపారని తెలిపారు. ఆశిష్ సింగ్, బీమా భాయ్, అనే వ్యక్తుల నుంచి కేజీ గంజాయి పదివేల రూపాయలు ధరకు కొని హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కాలేజీలకు గ్రామాలలో ఉండే కొంతమంది విద్యార్థులకు 50 గ్రాముల చొప్పున ప్యాకెట్లు తయారుచేసి అమ్మతున్నట్లు తెలిపారు. ఆదిభట్ల టిసిఎస్ చుట్టుపక్కల ఉన్న కంపెనీలో పని చేస్తున్న సంతోష్ ,శివ ,కరుణ, మిరాజ్ అనే వ్యక్తులకు ఈ ప్యాకెట్లు విక్రయిస్తున్నట్లు తెలిపారు. వీరితో పాటు రెండు ఫోన్లు 3.2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని గంజాయి విషయంలో ఇంకా పూర్తి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు SHO రాఘవేందర్ రెడ్డి తెలిపారు. అయితే.. అరెస్ట్ చేసిన నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.