ఈమధ్యకాలంలో గంజాయి విచ్చలవిడిగా పట్టుబడుతోంది. వివిధ కేసులలో పట్టుబడిన సుమారు మూడు కోట్ల రూపాయల విలువైన అక్రమ గంజాయిని దహనం చేశారు ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసులు. గురువారం ఉదయం కంచికచెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని పరిటాల గ్రామం, దొనబండ క్వారీ రోడ్ నందు గంజాయిని దగ్ధం చేశారు. ఎన్. టి. ఆర్.జిల్లాలోని కంచికచెర్ల, వన్ టౌన్, సత్యనారాయణపురం, అజిత్ సింగ్ నగర్, ఇబ్రహీంపట్నం , గుణదల మరియు పటమట పరిధిలోని పోలీస్ స్టేషన్లలో గత కొంత కాలంగా అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన 18 కేసులలో సుమారు మూడు కోట్ల రూపాయల విలువగలిగిన 7459 కేజీ ల గంజాయిని దహనం చేశామని పోలీసులు తెలిపారు.
ఈ సందర్బంగా నగర పోలీస్ కమీషనర్ శ్రీ కాంతి రాణా టాటా వివరాలు అందచేశారు. గంజాయి సాగు,అక్రమ రవాణాను అరికట్టే దిశగా అపరేషన్ పరివర్తన్ కార్యక్రమాన్ని పోలీస్ శాఖ చేపట్టిన సంగతి అందరికీ విదితమే. రాష్ట్ర డి.జి.పి. KV రాజేంద్రనాధ్ రెడ్డి ఆదేశాలతో దాడులు ముమ్మరం చేశారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకై పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. గంజాయి నిషేధిత పదార్థం,గంజాయిని అక్రమ రవాణా చేసినా, వినియోగించిన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Also:Mudragada Padmanabham: సీఎం జగన్ కు మరో లేఖ రాసిన ముద్రగడ
18 కేసులలో సుమారు మూడు కోట్ల రూపాయల విలువగలిగిన 7459 కేజీ ల గంజాయిని దహనం చేయడం జరిగింది. నగరంలోని పైన తెలిపిన 24 పోలీస్ స్టేషన్ లలో ఇప్పటివరకు 702 గంజాయి కేసులు నమోదయ్యాయి. ఈ గంజాయిని డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి ఆదేశానుసారం డ్రగ్ డిస్పోసల్ కమిటీ వారి ఉత్తర్వుల మేరకు దహనం చేయడం జరిగినది. ఈ ఆదేశానుసారం ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకుంటూ, ఎక్కడిక్కడ అక్రమ గంజాయి రవాణాను అరికడుతూ, కేసులు నమోదు చేస్తూ అక్రమార్కులను అరెస్ట్ చేయడం జరుగుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందవచ్చని కొంతమంది ఈ గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. వారు చట్టపరంగా అనేక సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఎవరు కూడా ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడవద్దని పోలీసులు హెచ్చరించారు.
Read Also: Mudragada Padmanabham: సీఎం జగన్ కు మరో లేఖ రాసిన ముద్రగడ