Kunja Satyavathi Dies: తెలంగాణ బీజేపీలో విషాదం.. మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి కన్నుమూత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Leader Kunja Satyavathi Passed Dies: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకురాలు కుంజా సత్యవతి కన్నుమూశారు. భద్రాచలంలోని నివాసంలో ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు (ఛాతీ నొప్పి) గురైన ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలోనే మృతి చెందారు. కుంజా సత్యవతి మృతి పట్ల అన్ని రాజకీయ పార్టీల నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కుంజా సత్యవతి దంపతులు ఆరంభంలో సీపీఎం పార్టీలో ఉండేవారు. ఆపై దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ఆర్ చొరవతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన సత్యవతి భద్రాచలం ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించారు. వైఎస్‌ఆర్ మరణానంతరం వైఎస్ఆర్ సీపీలోకి వెళ్లారు. కొన్నాళ్ల తరువాత మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరిన ఆమె.. ఆపై బీజేపీలో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి కుంజా సత్యవతికి టికెట్ దక్కే అవకాశాలు ఉన్నట్టు సమాచారం తెలుస్తోంది. ఇంతలోనే విషాదం చోటుచేసుకుంది.
Also Read
- Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
- KTR: గత పది, పదిహేను రోజులుగా ఒకాయనకు నిద్ర పట్టట్లేదు..
- Ragi Health Benefits: రాగి తింటున్నా పోషకాలు అందడం లేదా? మీరు చేసే ఈ చిన్న పొరపాట్లే కారణం!
- Secretariat Employees: సచివాలయ ఉద్యోగుల ఆందోళన.. ధర్నాచౌక్ వద్ద ఉద్రిక్తత!
కుంజా సత్యవతి మృతిపట్ల కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ‘బీజేపీ నేత శ్రీమతి కుంజా సత్యవతి ఆకస్మిక మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాను. 2009-14లో అసెంబ్లీలో వారితో కలిసి పని చేశాను. గిరిజనుల అభివృద్ధి కోసం ఎప్పుడూ తపనపడే సత్యవతి గారు.. ఏ చిన్న అవకాశం వచ్చినా ప్రజాసంక్షేమం విషయంలో తన వాణిని బలంగా వినిపించేవారు. ఇటీవలే సత్యవతి గారితో మాట్లాడాను. ఎన్నికల కోసం క్షేత్రస్థాయిలో జరుగుతున్న పని తీరును వారు వివరించారు. ఇంతలోనే ఇలాంటి దిగ్బ్రాంతికరమైన వార్త వినాల్సి వస్తుందనుకోలేదు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని కిషన్ రెడ్డి అన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు సత్యవతి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Virat Kohli Records: 110 పరుగులు, 2 సెంచరీలు.. సచిన్ నాలుగు రేర్ రికార్డులపై ‘కింగ్’ కోహ్లీ కన్ను!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Vaibhav Sooryavanshi: పోల్చుకోవడానికి ఏముంది?.. వైభవ్‌పై ఎలాంటి జెలసీ లేదు.. టీమిండియా స్టార్ సంచలన వ్యాఖ్యలు!
-
Dada : ‘దాదా’ మైసూర్ షెడ్యూల్ లో జాయిన్ కాబోతున్న NBK
-
KTR: గత పది, పదిహేను రోజులుగా ఒకాయనకు నిద్ర పట్టట్లేదు..
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?